సముద్రపు ఒడ్డున రత్తాలు రచ్చ.. బీచ్ వేర్ లో స్కిన్ షోతో మంటలు రేపుతున్న రాయ్ లక్ష్మి

First Published | Sep 4, 2023, 11:43 AM IST

కన్నడ బ్యూటీ, సీనియర్ నటి రాయ్ లక్ష్మి నెట్టింట అందాల జాతర చేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వెకేషన్ లో  ఎంజాయ్ చేస్తున్నది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోలను షేర్ చేస్తూ మంటలు పుట్టిస్తోంది.
 

దక్షిణాది బ్యూటీ రాయ్ లక్ష్మి (Raai Laxmi)  స్పెషల్ సాంగ్స్ తో దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. గతంలో తెలుగులో వరుసగా ఐటెం సాంగ్స్ లో నటించి ఊర్రూతలూగించింది. ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి ఆఫర్లు లేవు. 
 

కానీ, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో నటిస్తూ సందడి చేస్తోంది. గతంలో హీరోయిన్ గా అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మాత్రం స్పెషల్ అపీయరెన్స్ లతో వెండితెరపై దుమ్ములేపుతోంది. ఆడియెన్స్ ను గ్లామర్ ట్రీట్ తో మంత్ర ముగ్దులను చేస్తోంది. 
 


తెలుగులో రాయ్ లక్ష్మి ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘నీకు నాకు’, ‘ఆదినాయకుడు’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా మెప్పించింది. కానీ, ‘బలుపు’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘ఖైదీ నెం.150’, చిత్రాల్లో స్పెషల్ డాన్స్ లు చేసి సౌత్ మరింత గుర్తింపు సాధించింది. 

ఆ మధ్యలో ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’ అనే హారర్ర్ ఫిల్మ్ లో లీడ్ రోల్ లో రాయ్ లక్ష్మి నటించింది. ప్రస్తుతం హిందీ, మలయాళంలో వరుస చిత్రాల్లో నటిస్తోంది. చివరిగా బాలీవుడ్ లో విడుదలైన ‘భోళా’ సినిమాలో ఐటెం సాంగ్ తో అలరించింది. 

వెండితెరపై ఎలా మెరుస్తుందో  సోషల్ మీడియాలోనూ రాయ్ లక్ష్మి అందాల విందు చేస్తోంది. ముక్యంగా టూర్లకు, వెకేషన్లకు వెళ్తున్న ఈ సుందరి బికీనీల్లో దర్శనమిస్తూ స్కిన్ షోతో మంటలు రేపుతోంది. తాజాగా తన వెకేషన్ నుంచి కొన్ని బీచ్ ఫొటోలను పంచుకుంది. 

లేటెస్ట్ ఫొటోస్ లో బీచ్ లో వేర్ లో రాయ్ లక్ష్మి గ్లామర్ విందు చేసింది. బ్యాక్ నుంచి స్కిన్ షో చేస్తూ మతులు పోగొట్టింది. బీచ్ వేర్ లో పరువాల ప్రదర్శన చేసి ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. రాయ్ లక్ష్మి స్టన్నింగ్ పిక్స్ కు ఫ్యాన్స్, నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. 

Latest Videos

click me!