నవంబర్ లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగే అవకాశం కలదని సమాచారం ఉంది. ఈ విషయంపై వరుణ్ తేజ్ నేరుగా క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి నవంబర్ లో ఉండొచ్చు. ఎప్పుడనేది అమ్మ నిర్ణయమే. డెస్టినేషన్ వెడ్డింగే ప్లాన్ చేస్తున్నాం అన్నారు. వరుణ్ తేజ్ ఇలాంటి కామెంట్స్ చేయగా కుటుంబం విదేశాలకు వెళ్లడం ఆసక్తి రేపుతోంది.
26
Varun Tej
నాగబాబు(Nagababu), వరుణ్ తేజ్, నిహారిక, పద్మజ విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం వారు ఆఫ్రికా దేశంలో ఉన్నట్లు సమాచారం. ఆఫ్రికా వైల్డ్ సఫారీకి పెట్టింది పేరు. అక్కడకు వెళ్లిన టూరిస్ట్స్ జీవ వైవిధ్యం చూసి ఎంజాయ్ చేస్తారు. నాగబాబు ఫ్యామిలీ సైతం వైల్డ్ సఫారీ చేస్తున్నారు. నిహారిక ఈ మేరకు ఓ ఫోటో షేర్ చేసింది.
36
Varun Tej
మరి ఈ విదేశీ టూర్లో వరుణ్ తేజ్ వివాహ వేదికకు సంబంధించిన లొకేషన్ సెలెక్ట్ చేస్తారేమో చూడాలి. ముఖ్యంగా ఇటలీ అనుకుంటున్నట్లు సమాచారం. కారణం ఏదైనా చాలా కాలం తర్వాత నాగబాబు ఫ్యామిలీ మొత్తం విదేశీ విహారానికి వెళ్లారు.
46
Niharika Konidela
ఇటీవల నిహారిక(Niharika Konidela) విడాకుల ప్రకటించిన సంగతి తెలిసిందే. భర్త వెంకట చైతన్య జొన్నలగడ్డ నుండి ఆమె విడిపోయారు. ఈ క్రమంలో కొంత డిప్రెషన్ అనుభవిస్తుంది. ఈ క్రమంలో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఆమె గడపాలని అనుకుంటుంది. ఈ ఫారిన్ ట్రిప్ ఉద్దేశం అది కూడా కావచ్చు.
56
అలాగే నాగబాబు, నిహారిక, వరుణ్ తమ వృత్తుల్లో బిజీగా ఉంటున్నారు. నాగబాబు నటుడిగా అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు. అదే సమయంలో జనసేన కీలక నేతగా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇక నిహారిక నటిగా, నిర్మాతగా రాణిస్తుంది. ఇటీవల ఆఫీస్ ఓపెన్ చేసి కొత్త ప్రాజెక్ట్స్ రూపొందించే పనిలో ఉంది.
66
Gandeevadhari Arjuna movie review
ఇక వరుణ్ తేజ్(Varun Tej) వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్నారు. ఆయన నటించిన ఎఫ్ 3, గని, గాండీవధారి అర్జున నిరాశపరిచాయి. గాండీవధారి అర్జున వరుణ్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ బ్యాడ్ మూడ్ నుండి బయటపడేందుకు వరుణ్ కి ఈ టూర్ సహాపడుతుంది. ప్రస్తుతం ఆయన మట్కా తో పాటు మరో చిత్రం చేస్తున్నారు.