గ్యాప్ లేకుండా డేటింగ్ చేశా.. నా భర్త కూడా అమ్మాయిలతో.. ప్రియాంక చోప్రా కామెంట్స్ వైరల్

First Published | May 11, 2023, 2:30 PM IST

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) షాకింగ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఆయా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత విషయాలను నిర్మోహమాటంగా పంచుకుంటోంది.

బాలీవుడ్ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులకు మరింతగా దగ్గరవుతోంది. తన ప్రాజెక్ట్స్ ను ప్రమోట్ చేసేందుకు ప్రియాంక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 

తాజాగా అలెక్స్ కూర్ ‘కాల్ హర్ డాడీ’ పాడ్ క్యాస్ట్ లో మాట్లాడింది. ఈ సందర్భంగా తన కేరీర్ విషయాల గురించే కాకుండా వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. తన డేటింగ్ డిటేయిల్స్ ను నిర్మోహమాటంగా వెల్లడించింది. ఈక్రమంలో తన భర్త నిక్ జోనాస్ గురించి స్పందించింది.


ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో ఎంతో మందితో లవ్ ట్రాక్ నడిపించింది. ఒకరితో తర్వాత మరొకరితో డేటింగ్ చేస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్ గ్గానే నిలిచింది. ఈ విషయాల గురించి ప్రియాంక తాజాగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. నిక్ తో జీవితం పంచుకోవడంపైనా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
 

గ్లోబల్ బ్యూటీ మాట్లాడుతూ.. ‘నిక్  జోనస్ ను కలిసేందుకు ముందు నేను కొందరిని ప్రేమించాను. గ్యాప్ లేకుండా ఒకరితో బ్రేకప్ అవ్వగానే మరోకరితో ప్రేమలో పడేదాన్ని. కానీ బంధాలు ఎక్కువ రోజులు నిలబడలేదు. అదే క్రమంలో నటిగానూ ఎంతో బిజీగా ఉండేదాన్ని.

నాతో కలిసి పనిచేసిన వారితో డేటింగ్ చేసదాన్ని. కొందరితో రిలేషన్ షిప్ కాస్తా విషాందంగానే ముగిసింది. కానీ వారందరూ అద్భుతమైన వారు. అయితే చివరి బ్రేకప్ తర్వాత మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాను. ఎందుకు అందరితో నా ప్రేమ విఫలం అవుతుందని నాకునేనే ప్రశ్నించుకున్నాను. 
 

ఆ సమంలోనే నిక్ ను కలిశాను. నిక్ కూడా నాకంటే ముందు చాలా మంది అమ్మాయిలతో ప్రేమలో పడ్డాడు. నాకు ఆ గతం కంటే నిక్ తో భవిష్యత్ కనిపించింది. అందుకే నా జీవితంలో భర్తగా నిక్ జోనస్ ప్రమోషన్ పొందాడు. జరిగిన దాన్ని మరిచి జీవితం కొనసాగించాలని నిర్ణయించుకున్నాం.’ అంటూ చెప్పుకొచ్చింది. కొన్నాళ్ల డేటింగ్ తర్వాత వీరిద్దరూ 2018లో రాజస్థాన్ వేదికగా పెళ్లి చేసుకున్నారు. 
 

Latest Videos

click me!