ట్రెండీ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్న ‘ఓజీ’ భామ.. పింక్ టాప్ టైట్ జీన్స్ లో అదిరిన పోజులు

First Published | May 14, 2023, 12:58 PM IST

యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ అదిరిపోయే లుక్స్ లో ఆకట్టుకుంటున్నారు. 
 

తమిళ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. నేచురల్ స్టార్ నాని (Nani) ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తన అందం, నటనతో కట్టిపడేసింది. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ వస్తోంది.
 

నాని తర్వాత శర్వానంద్ సరసన ‘శ్రీకారం’లో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ బ్యూటీకి మరింత క్రేజ్ దక్కాలంటే ఇంకాస్తా సమయం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రియాంకకు టాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ తగిలింది. 
 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన నటించే ఛాన్స్ ను దక్కించుకుందీ ముద్దుగుమ్మ. ఇప్పటికే తమిళ స్టార్ సూర్య, శివకార్తీకేయ సరసన నటించి మెప్పించింది. ఇప్పుడు ఏకంగా పవన్ - సుజీత్ కాంబోలో వస్తున్న OGలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. 
 

ప్రస్తుతం ప్రియాంక మోహన్ ‘ఓజీ’పైనే ఆశలు పెట్టుకుంది. ‘సాహో’ తర్వాత డైరెక్టర్ సుజీత్ పవన్ తో గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సినిమా తెరకెక్కిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. రీసెంట్ గా లాంగ్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు. 
 

ఇదిలా ఉంటే ప్రియాంక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ బ్యూటీ ఎక్కువగా సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తుంది. గ్లామర్ షోకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. దీంతో తనదైన మార్క్ ను క్రియేట్ చేస్తోంది. 

కాగా, తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరిసింది. టైట్ జీన్స్, పింక్ టాప్, లేతగులాబీ షర్ట్ ధరించింది. సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ తన అందంతో ఆకట్టుకుంటోంది. క్యూట్ స్టిల్స్ తో కట్టిపడేసింది. అభిమానులు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!