జబర్దస్త్ కి కొత్త జడ్జిగా బ్యూటిఫుల్ హీరోయిన్... ఇకపై కామెడీషో నెక్స్ట్ లెవెల్!

Published : May 14, 2023, 12:57 PM IST

జబర్దస్త్ షోకి కొత్త జడ్జి వచ్చింది. బ్యూటిఫుల్ హీరోయిన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె రాకతో షో మరింత కలర్ఫుల్ గా మారిపోయింది. 

PREV
16
జబర్దస్త్ కి కొత్త జడ్జిగా బ్యూటిఫుల్ హీరోయిన్... ఇకపై కామెడీషో నెక్స్ట్ లెవెల్!

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ మునుపటి కోల్పోయాయనేది నిజం. స్టార్స్ తప్పుకోగా ఆడియన్స్ లో క్రేజ్ తగ్గింది. షోకి పూర్వ వైభవం తేవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త జడ్జిని తీసుకొచ్చారు. 
 

26


ఎక్స్ట్రా జబర్దస్త్  జడ్జిగా హీరోయిన్ సదా ఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు లేటెస్ట్ ప్రోమోలో క్లారిటీ ఇచ్చారు. నటుడు కృష్ణ భగవాన్ తో పాటు జబర్దస్త్ జడ్జి సీటును సదా పంచుకున్నారు. ట్రెండీ వేర్లో సదా సూపర్ గ్లామరస్ గా కనిపించారు. ఆమె  రాక జబర్దస్త్ కి మేలు చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఆమె ఇమేజ్ ఆదరణ తెచ్చిపెడుతుందని ఆశపడుతున్నారు. 

36

మొన్నటి వరకు వరకు సదా బీబీ జోడి డాన్స్ రియాలిటీ షోలో ఆమె సందడి చేశారు. తాజాగా ఆమె జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ సైతం రీఎంట్రీ ఇచ్చాడు. షో బిగినైన కొత్తల్లో షకలక శంకర్ టీం లీడర్ గా ఉన్నారు. వెండితెరపై బిజీ అయిన ఆయన జబర్దస్త్ వదిలేశాడు. ఇక రష్మీ గౌతమ్ ఎక్స్ట్రా జబర్దస్త్ షో యాంకర్ గా చేస్తున్న విషయం తెలిసిందే.  
 

46

గతంలో కూడా కొన్ని రియాలిటీ షోలకు సదా జడ్జిగా వ్యవహరించారు. తెలుగు పాపులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ  రెండు సీజన్స్  కి జడ్జిగా చేశారు. జయా టీవీలో ప్రసారమైన షోకి మొదటిసారి ఆమె జడ్జిగా వ్యవహరించారు. ఇక సదా కెరీర్ పరిశీలిస్తే ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అవుతుంది. 2018లో విడుదలైన తమిళ చిత్రం టార్చ్ లైట్ తర్వాత మరలా కనిపించలేదు. మంచి ఆఫర్ వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నారు. 

56


సదా పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. మంచి ఆరంభం లభించినా పునాది వేసుకోలేకపోయింది. జయం డెబ్యూ మూవీ 2002లో విడుదలైన సెన్సేషనల్ విజయం సాధించింది.  ఆ మూవీతో సదా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. జయం మూవీ సదాకు వరుస ఆఫర్స్ తెచ్చిపెట్టింది. ఆమె బిజీ యాక్ట్రెస్ అయ్యారు . అయితే ఆమెకు స్టార్స్ పక్కన అరుదుగా అవకాశాలు వచ్చాయి. ఫార్మ్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కి జంటగా నటించిన నాగ ఆడలేదు. అనంతరం బాలయ్యతో వీరభద్ర చిత్రం చేసింది. ఇది కూడా నిరాశపరిచింది. 
 

66
Heroine Sadaa


ఇక సదా కెరీర్లో ఉన్న మరో అతిపెద్ద హిట్ అపరిచితుడు. దర్శకుడు శంకర్-విక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించింది. అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ హిట్ మరలా పడలేదు. స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడ్డ సదా ప్లాప్స్ తో రేసులో వెనుకబడింది. ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2016 తర్వాత రెండేళ్లు ఆమె పరిశ్రమకు దూరమయ్యారు.
 

Read more Photos on
click me!

Recommended Stories