కేరీర్ విషయానికొస్తే ప్రియా ప్రస్తుతం తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో గతంలో ‘చెక్’, ’ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’లో మెరిసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతోనైనా ప్రియా కేరీర్ ఊపందుకుంటుందా చూడాలి.