ఇక లహరి, హమీద మధ్య చిన్నపాటి వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. ఈ గొడవలో ఎమోషనల్ అయిన లహరి కంటతడి పెట్టుకుంది. తర్వాత హౌస్ లో కాస్త వినోదాత్మక సంఘటనలు జరుగుతాయి. సిరిని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ పిలుస్తారు. ఆమెకి బిగ్ బాస్ ప్రత్యేక పవర్స్ ఇస్తారు. దీని ప్రకారం ఇద్దరు సభ్యులని ఎంచుకోమని బిగ్ బాస్ సిరికి చెబుతారు. ఇద్దరిలో ఒకరు యజమాని, మరొకరు సర్వెంట్. యజమాని చెప్పినట్లు సర్వెంట్ నడుచుకోవాలి. దీని కోసం యజమానిగా షణ్ముఖ్ ని, సర్వెంట్ గా లోబోని సిరి ఎంచుకుంటుంది.