బాహుబలి, RRR కాదు..ఆ విజువల్ వండర్ వెనుక ఎన్ని కష్టాలో, నిజంగానే పాము కాటుకి గురై

First Published Mar 13, 2024, 10:42 AM IST

ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది. చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ అందించే బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు వస్తున్నాయి. కానీ పాతికేళ్ల కృతేమే ఓ లెజెండ్రీ తెలుగు డైరెక్టర్ ఆడియన్స్ ని తన విజువల్స్ మాయాజాలంలో ముంచేయాలని ఎంతో శ్రమించేవారు.

ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది. చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ అందించే బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు వస్తున్నాయి. కానీ పాతికేళ్ల కృతేమే ఓ లెజెండ్రీ తెలుగు డైరెక్టర్ ఆడియన్స్ ని తన విజువల్స్ మాయాజాలంలో ముంచేయాలని ఎంతో శ్రమించేవారు. అందుకే ఆయన దర్శకత్వం నుంచి అమ్మోరు, దేవి, దేవి పుత్రుడు లాంటి అద్భుత చిత్రాలు జాలువారాయి. 

ఇప్పటికే అర్థం అయిపోయి ఉంటుంది ఆ దర్శకుడు ఎవరో అని.. ఆయనే కోడి రామకృష్ణ. అప్పట్లో ఫాంటసీ చిత్రాలకు మంచి డిమాండ్ ఉండేది. కానీ హీరోయిన్ ని ప్రధాన పాత్రలో పెట్టి సినిమా చేయడం అంటే రిస్క్. అలాంటి రిస్క్ కు చేయడం ఆయనేకే చెల్లింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవి' చిత్రం విడుదలై మార్చి 12కి పాతికేళ్ళు పూర్తవుతోంది. 

రమ్యకృష్ణ, విజయశాంతి, సౌందర్య లాంటి స్టార్ హీరోయిన్లు ఉన్నప్పటికీ ఆయన నటి ప్రేమని ప్రధాన పాత్రలో పెట్టి దేవి చిత్రం చేశారు. అది చాలా రిస్క్. రిస్క్ అయినా తన క్రియేటివిటీతో అద్భుతం చేశారు. దేవి పాత్రలో ప్రేమ చక్కగా ఒదిగిపోయింది అనే ప్రశంసలు దక్కాయి. 

ఈ చిత్రం విడుదలై పాతికేళ్ళు పూర్తయిన సందర్భంగా హీరోయిన్ ప్రేమ అప్పటి సంగతులని గుర్తు చేసుకుంది. కోడి రామకృష్ణ గారు ఈ చిత్రం కోసం ఎంతో రిస్క్ చేశారు. ఈ చిత్రం అంతటి విజయం సాధించిందంటే కంప్లీట్ క్రెడిట్ ఆయనదే. ప్రతి చిన్న సన్నివేశంపై ఆయన ఎంతో శ్రద్ద చూపించేవారు. 

అనుకున్నట్లుగా సన్నివేశం వచ్చేవరకు 50 టేకులైనా చేయించేవారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఎదురైనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నా డైలాగుల విషయంలో, బాడీ లాంగ్వేజ్ విషయంలో రామకృష్ణ ప్రత్యేక శ్రద్ద పెట్టారు. నా డైలాగులు ఎక్కడా అల్లరి చిల్లరగా ఉండవు. సాధారణ సన్నివేశాల్లో కూడా దేవి ఎలా మాట్లాడుతుందో అలాగే డైలాగ్స్ చెప్పాలని చెప్పేవారు. 

ఇక షూటింగ్ సమయంలో ఒక విషాదం జరిగింది. ఈ చిత్రాన్ని నాగదేవి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. కానీ షూటింగ్ లో ఒక వ్యక్తి నిజగానే పాము కాటుకి గురయ్యారు. ఆయన్ని రక్షించడానికి ఎంతో ప్రయత్నించాం. కానీ విషం ఎక్కేయడం వల్ల మరణించారు. ఆ విషాదంలో కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా జరగలేదు. 

ఈ చిత్రంలో మరో పెద్ద సవాల్ క్లైమాక్స్. మంచు కొండల్లో షూటింగ్.. చిత్ర యూనిట్ మొత్తం చాలా కష్టపడింది. సినిమా మొత్తం ఒకెత్తయితే అక్కడ షూట్ చేయడం మరో ఎత్తు. ఎన్నో కష్టాలు భరిస్తూనే షూటింగ్ పూర్తి చేశాం. అంత కష్టపడ్డప్పటికీ ఈ మూవీ ఈ రేంజ్ హిట్ అవుతుందని అసలు ఊహించనేలేదు. ఒక మంచి చిత్రం అవుతుందని అనుకున్నాం. 

కానీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మరో ఆసక్తికర అంశం ఏంటంటే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కి ఇది తొలి చిత్రం. తొలి చిత్రం అయినపప్టికీ దేవి క్లాసిక్ ఆల్బమ్ అందించారు. ఈ చిత్రంలో ప్రతి పాట వినసొంపుగా ఉంటుంది. 

click me!