బ్లాక్ ఫ్రాక్ లో ప్రణీతా సుభాష్ మెరుపులు.. బుట్టబొమ్మకు ఇంత అందం ఎలా సాధ్యమవుతుందో మరీ

First Published | Jul 24, 2023, 8:35 PM IST

టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) స్టన్నింగ్ లుక్స్ తో అదరగొడుతోంది.  పెళ్లై, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినా ఏమాత్రం చెక్కుచెదరలేదు. మరింత అందంగా మారి మతులు పోగొడుతోంది.
 

టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ తెలుగులో కొన్ని చిత్రాలే చేసిన ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేసింది. ‘బావ’ చిత్రంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మంచి గుర్తింపు దక్కింది. తన నటన, గ్లామర్ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.  
 

కన్నడ, తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చిన ప్రణీతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’లో నటించి మెప్పించింది. చిత్రంలో ప్రణీత నటనకు మంచి మార్కులు దక్కాయి. ఈ మూవీ తర్వాత బుట్టబొమ్మగానూ బిరుదు అందుకుంది. 
 


మొదటి లాక్ డౌన్ లో ప్రణీత పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. బెంగళూరులోనే ఈ ముద్దుగుమ్మ వివాహం జరిగింది. వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి  గతేడాది చివర్లో ఈ ముద్దుగుమ్మ పండంటి ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చింది. 
 

పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా కొద్దికాలం ప్రణీతా సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. అయితే ఈసారి మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. మలయాళ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ 148వ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 
 

ఇదిలా ఉంటే ప్రణీతా సుభాష్ సోషల్ మీడియాలో రోజురోజుకు అందంగా మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ స్టన్నింగ్ ష్టిల్స్ లో ఆకట్టుకుంటోంది. అసలీ ముద్దుగుమ్మకు పెళ్లై, కూతురు కూడా ఉందంటే నమ్మలేం అనేలా చేస్తోంది. 
 

తాజాగా బ్లాక్ లాంగ్ ఫ్రాక్ లో మెరిసింది. మెరిసిపోయే స్కిన్ టోన్ పై నల్లటి డ్రెస్ మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. మరోవైపు ప్రణీతా బ్యూటీఫుల్ స్మైల్, రూపసౌందర్యంతో చూపుతిప్పుకోకుండా చేసింది. ఫ్యాన్స్, నెటిజన్లు కూడా ఈ ముద్దుగుమ్మ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. మరింతగా ఎంరేజ్ చేస్తున్నారు. 

Latest Videos

click me!