కళ్లలోనే అందాన్ని దాచిన బాపూబొమ్మ.. హాఫ్ శారీలో ప్రణీతా సుభాష్ బ్యూటీఫుల్ లుక్

First Published | Jun 8, 2023, 1:58 PM IST

గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ (Pranitha Subhas) రోజురోజుకు మరింత అందంగా దర్శనమిస్తూ హృదయాలను కొల్లగొడుతోంది.  తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు చాలా బ్యూటీఫుల్ గా ఉన్నాయి.
 

కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ తెలుగులో సినిమాలు చేయక దాదాపు నాలుగేళ్లు అవుతోంది. చివరిగా ‘హాలో గురు ప్రేమ కోసమే’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత హిందీలో రెండు సినిమాల్లో నటించి పెళ్లి చేసుకుంది. 
 

వ్యాపార వేత్త నితిన్ రాజును ప్రణీత వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2021 మే 30న వీరి మ్యారేజ్ చాలా సింపుల్ గా, కొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగింది. కోవిడ్ కారణంగా గ్రాండ్ గానిర్వహించలేకపోయారు. ఇక గతేడాది పండంటి ఆడబిడ్డ అర్ణకు జన్మనిచ్చింది. 
 


పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ప్రణీతా కెరీర్ లో బిజీఅయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ‘రమణ అవతార’ చిత్రంలో నటిస్తుండగా.. మలయాళంలోకీ కూడా ఎంట్రీ ఇస్తోంది. తొలిచిత్రంగా సూపర్ స్టార్ దిలీప్ 148వ చిత్రంలో నటిస్తోంది. 
 

అయితే, ప్రస్తుతం ఈ రెండు చిత్రాలతో బిజీగానే ఉన్న ప్రణీత మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుస పోస్టులు పెడుతూ దర్శకనిర్మాతల కంట్లో పడేలా చేస్తోంది. 
 

మరోవైపు ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కూడా కట్టిపడేస్తోంది. రోజురోజుకు మరింత అందంగా మెరుస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా ట్రెడిషనల్ వేర్ లో వెలిగిపోయింది.
 

లేటెస్ట్ పిక్స్ లో ప్రణీతా సుభాష్ చందమామలా ప్రకాశవంతంగా మెరిసింది. పింక్ హాఫ్ శారీలో హోయలు పోయింది. అందమైన కళ్లు, ఆకర్షించే చూపులతో చూపు తిప్పుకోకుండా చేసింది. క్యూట్ స్మైల్ తో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

Latest Videos

click me!