చిన్నారి పాపతో ప్రణీతా సుభాష్ అల్లరి.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తల్లికూతురు

First Published | Sep 8, 2023, 5:06 PM IST

సౌత్ బ్యూటీ ప్రణీతా సుభాష్ సంప్రదాయాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. తాజాగా తన స్నేహితురాలి ఉంట్లో జరిగిన పూజాకార్యక్రమానికి తన కూతురితో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను పంచుకుంది.
 

కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన  విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన వ్యక్తిగత విషయాలను, ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది.
 

ఇక, ప్రణీతా 2021లోనే తన ప్రియుడు, వ్యాపారవేత్త నితిన్ రాజ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది బెంగళూరులోని ఓ ఆస్ప్రతిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి ప్రమోషన్ పొందడంతో ఆమె అభిమానులు చాలా సంతోషించారు. 


ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ షూటింగ్స్ మినహా మిగతా సమయాన్ని తన ఫ్యామిలీకే కేటాయిస్తోంది. ముఖ్యంగా తన కూతురితో ఎక్కువ సమయం గడుపుతోంది. ఎప్పకటిప్పుడు చిన్నారితో దిగిన ఫొటోలనూ పంచుకుంటూ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తోంది. 
 

హిందూ సంప్రదాయాలకు ప్రణీతా ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలిసిందే. ఈ క్రమంలో తన కూతురుని ఆ బాటలోనే నడిపిస్తోంది. ఇక తాజాగా తన స్నేహితురాలి ఇంట్లో నిర్వహించిన సత్యానారాయణ వ్రతం పూజా కార్యక్రమానికి ప్రణీతా కూతురితో హాజరైంది. తల్లికూతురు ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోయారు. 
 

ఫొటోలను పంచుకుంటూ తన కూతురి గురించి ఇంట్రెస్టింగ్ నోట్ రాసుకొచ్చింది. తను పూజాకు వెళ్లి, లాంచ్ పూర్తి చేసుకుని వచ్చే వరకు.. చిన్నారి బాల్కానీలో తిరుగుతూ కనిపించిందంట. దీంతో కూతురుతో పాటే కాసేపు ఆడుకుంది. ఈక్రమంలో ఫొటోలకూ ఫోజులిచ్చింది. 

తల్లిగా ప్రణీతా సుభాష్ తన కూతురుని చూస్తూ పొంగిపోతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆమెను మెచ్చుకుంటూ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ.. Dileep 148 చిత్రంలో నటిస్తోంది. ఈ క్రమంలో తెలుగులో ఈ బ్యూటీ మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
 

Latest Videos

click me!