మేకప్‌ లేకుండా డార్క్ ఛాక్లెట్‌లా సెగలు కక్కుతున్న ఓజీ భామ.. నడుము కనిపించేలా చిన్నటాప్‌లో శ్రియా రెడ్డి రచ్చ

Aithagoni Raju | Published : Sep 8, 2023 5:04 PM
Google News Follow Us

`ఓజీ` బ్యూటీ శ్రియా రెడ్డి.. అద్భుతమైన పర్‌ఫెర్మెన్స్ లతో ఆకట్టుకుంటుంది. ప్రశంసలందుకుంటుంది. ఈ క్రమంలో అదే సమయంలో తన నయా అందాలతో దుమారం రేపుతుంది. 
 

18
మేకప్‌ లేకుండా డార్క్ ఛాక్లెట్‌లా సెగలు కక్కుతున్న ఓజీ భామ.. నడుము కనిపించేలా చిన్నటాప్‌లో శ్రియా రెడ్డి రచ్చ

శ్రియా రెడ్డి (Sriya Reddy) చాలా కాలంగానే నటిగా రాణిస్తుంది. తెలుగులో కంటే ఇతర భాషల్లో ఎక్కువగా రాణిస్తుంది. తమిళంలో పాపులర్‌ అయిన ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులోనూ పాపులర్‌ అయిపోయింది. టాలీవుడ్‌లో గతంలో రెండు సినిమాల్లో మెరిసినా, ఇప్పుడు అనూహ్యంగా ఆమెకి క్రేజ్‌ నెలకొంది. 

28

అందుకు కారణం.. తెలుగులో ఆమె పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో చేస్తుండటమే. శ్రియా రెడ్డి.. పవన్‌ కళ్యాణ్‌తో `ఓజీ`లో నటిస్తుంది. ఇందులో కీలక పాత్రలో కనిపించబోతుంది. టీమ్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ తెలుగులో క్రేజ్‌ని సొంతం చేసుకుంది. 
 

38

దీంతో ఈ అమ్మడికి సంబంధించిన ప్రతి కదలికని అంతా గమనిస్తున్నారు. ఈ క్రమంలో అందాల నిధి బయటపడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బ్యూటీ అదిరిపోయే ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. బోల్డ్ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. అసలైన అందాలను ఆవిస్కరిస్తూ పిచ్చెక్కిస్తుంది. 
 

Related Articles

48

తాజాగా ఈ బ్యూటీ డార్క్ ఛాక్లెట్‌గా మారిపోయింది. మేకప్‌ లేకుండా కుర్రాళ్లని టెంప్ట్ చేసే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. చిన్నదైన టాప్‌ వేసుకుంది. నడుము కనిపించేలా పోజులిచ్చింది. కసి చూపులతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

58

తమిళనాడుకి చెందిన ఈ బ్యూటీ తెలుగు చిత్రంతోనే హీరోయిన్‌గా వెండితెరకి పరిచయమైంది. 2003లో `అప్పుడప్పుడు` అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో రాజా హీరో. ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. కానీ ఈ బ్యూటీ తెలుగులో కంటిన్యూ కాలేకపోయింది. ఆ తర్వాత మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. `బ్లాక్‌` అనే చిత్రంలో నటించింది. 
 

68

అట్నుంచి ఓ ఇంగ్లీష్‌ మూవీ చేసింది. దీంతోపాటు మరో మలయాళ మూవీలో కనిపించింది. మూడేళ్ల తర్వాత `అమ్మ చెప్పింది` అనే చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. మళ్లీ కనిపించలేదు. అట్నుంచి సొంత లాంగ్వేజ్‌ తమిళంలో అవకాశాలు దక్కించుకుంది. వరుసగా కోలీవుడ్‌లో సినిమాలతో బిజీగా గడిపింది. 
 

78

2008 తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ పదేళ్ల తర్వాత కోలీవుడ్‌లోనే రీఎంట్రీ ఇచ్చింది. ఒకటి అర సినిమాలతో కెరీర్‌ని లాక్కొస్తుంది. ఈ క్రమంలో తెలుగులో రెండు భారీ సినిమాల్లో నటించే అవకాశాలను సొంతం చేసుకుంది. ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న `సలార్‌`లో కీలక పాత్ర పోషిస్తుందీ బ్యూటీ. 

88

దీంతోపాటు పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న గ్యాంగ్‌ స్టర్‌ మూవీ `ఓజీ`లో కీలక పాత్రలో కనిపించబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతోపాటు తమిళఃలో `ఆండవ కానమ్‌` అనే చిత్రంలో శ్రియా రెడ్డి నటిస్తూ బిజీగా ఉంది. గ్లామర్‌ పాత్రలు కాకుండా నటనకు స్కోప్‌ ఉన్న బలమైన పాత్రలే చేస్తూ రాణిస్తుందీ బ్యూటీ. అలాంటి చిత్రాలకు ప్రయారిటీ ఇస్తుందీ హాట్‌ హీరోయిన్‌. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos