ఈ సందర్భంగా వరుస ఫొటోషూట్లతో తనను అభిమానించే వారితో పాటు నెటిజన్ల హృదయాలనూ కొల్లగొడుతోంది. ఫ్యాన్స్ కూడా ప్రణీత ఫొటోలను లైక్స్, కామెంట్లతో క్షణాల్లోనే నెట్టింట వైరల్ చేస్తూ వస్తున్నారు. తెలుగులో ప్రణీత చివరిగా ‘హలో గురు ప్రేమ కోసమే’, ‘ఎన్టీఆర్ : కథానాయకుడు’ చిత్రాల్లో నటించింది. హిందీలోనూ రెండు సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం కన్నడలో ‘రమణ అవతార’, మలయాళంలో సీనియర్ నటుడు దిలీప్ సరసన Dileep 148లో నటిస్తోంది.