పాతికేళ్ల ప్రాయంలో నటి ప్రగతిని చూశారా? అప్పటి కంటే ఇప్పుడే బాగుందా? ఇదేం ట్విస్ట్! 

Published : May 29, 2024, 05:43 PM IST

ప్రగతి సోషల్ మీడియా సెన్సేషన్ గా అవతరించింది. ఆమె ఫోటోలు, వీడియోలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. ఆమె 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. ఆ ఫోటో చూసిన నెటిజెన్స్ అవాక్కు అవుతున్నారు.   

PREV
15
పాతికేళ్ల ప్రాయంలో నటి ప్రగతిని చూశారా? అప్పటి కంటే ఇప్పుడే బాగుందా? ఇదేం ట్విస్ట్! 


క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి అందరికీ పరిచయమే. అయితే ఆమె కెరీర్ మొదలైంది హీరోయిన్ గా. టీనేజ్ లో ప్రగతి రెండు మూడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. నటిగా ఎదిగే క్రమంలో పెళ్లి చేశారు. దాంతో ఆమె కెరీర్ కి బ్రేక్ పడింది . బాబీ మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. 

25
Pragathi

తల్లి, అత్త పాత్రల్లో ప్రగతి సూపర్ సక్సెస్ అయ్యింది. వందల చిత్రాల్లో నటించింది. సడన్ గా ప్రగతి సోషల్ మీడియా ఫ్రీక్ గా మారింది. నచ్చినట్లు ఉండాలి, చేయాలి అనే తత్వానికి అలవాటు పడింది. డాన్సు వీడియోలు, ఫిట్నెస్ వీడియోలు షేర్ చేస్తూ నెటిజెన్స్ ని ఆకర్షించడం ప్రారంభించింది. 
 

35
Pragathi

ప్రగతి వీడియోలపై విపరీతమైన ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రగతి నెగిటివ్ కామెంట్స్ ని పట్టించుకోలేదు. ఈ వయసులో మీరు జిమ్ చేయడం అవసరమా అంటూ ఎద్దేవా చేసేవారు. వారికి ప్రగతి గట్టిగానే కౌంటర్స్ ఇచ్చింది. నా ఆరోగ్యం కోసం నేను వ్యాయామం చేస్తున్నాను. మీకేంటి ఇబ్బంది అని కౌంటర్స్ ఇచ్చింది. 
 

45
Pragathi

తాజాగా ప్రగతి 25 ఏళ్ల ప్రాయంలో దిగిన ఫోటో ఒకటి షేర్ చేసింది. మన వయసు ఎంతైనా 25 ఏళ్ల ప్రాయంలానే ఫీల్ అవ్వాలని ఆమె ఆ ఫోటో షేర్ చేశారు. ఆ విధంగా ఆత్మ విశ్వాసం ప్రకటించారు. సదరు ఫోటో చూసిన నెటిజెన్స్.. అప్పటి కంటే ఇప్పుడే బాగున్నావని కామెంట్స్ చేస్తున్నారు. 
 

55
pragathi

ఈ మధ్య ప్రగతి అరుదుగా సినిమాల్లో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటుంది. భర్తతో విడిపోయిన ప్రగతి కూతురితో పాటు ఒంటరిగా జీవిస్తుంది. తరచుగా ప్రగతి రెండో పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. 

click me!

Recommended Stories