టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్స్ అంటే వివి వినాయక్ పేరు ముందుగా గుర్తుకు వస్తుంది. హీరోల ఇమేజ్ కి తగ్గట్లుగా మాస్ చిత్రాలతో మెప్పించడం వివి వినాయక్ శైలి. ఎన్టీఆర్, చిరంజీవి, అల్లు అర్జున్, బాలకృష్ణ , రవితేజ ఇలా చాలా మంది స్టార్ హీరోలతో వివి వినాయక్ అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు.
ఇటీవల వివి వినాయక్ ట్రెండ్ కి తగ్గట్లుగా సినిమాలు చేయడంలో వెనుకబడ్డారు. అందుకే వినాయక్ నుంచి ఇటీవల సినిమాలు రాలేదు. చిరంజీవి, బాలయ్య లాంటి హీరోలతో ఆ మధ్య సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు కానీ కుదర్లేదు. అదే విధంగా దిల్ రాజు నిర్మాణంలో వినాయక్ హీరోగా ఒక చిత్రం ప్రారంభం అయింది. అది కూడా ఆగిపోయింది.
తాజాగా వస్తున్న వార్తల ప్రకారం వివి వినాయక్ గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన జీర్ణ సంబంధింత సమస్యలతో భాదపడుతున్నారట. ట్రీట్మెంట్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనితో వివి వినాయక్ ఇంటికే పరిమితం అయినట్లు వార్తలు వస్తున్నాయి.
మరో ఆందోలనకర అంశం ఏంటంటే వినాయక్ ఆరోగ్య సమస్యల వల్ల బాగా బరువు తగ్గిపోయారట. ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దీనితో వివి వినాయక్ సోదరుడు విజయ్ స్పందించినట్లు తెలుస్తోంది. వినాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నారు అనేది కొన్ని నెలల క్రితం సంగతి ని అన్నారు. ఆయన ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు అని విజయ్ తెలిపారట.
వివి వినాయక్ చేతుల మీదుగా ప్రారంభమైన కొబ్బరిల్లు రెస్టారెంట్ (ఫోటోలు)
ట్రీట్మెంట్ తీసుకుని వినాయక్ కోలుకున్నారు. త్వరలోనే ఆయన నంది హిల్స్ లోని తన ఆఫీస్ కి ఎప్పటిలాగే వస్తారు అని తెలిపారు. అభిమానులు కూడా వినాయక్ స్వయంగా తన హెల్త్ గురించి క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ సినిమాలు మొదలు పెట్టాలని భావిస్తున్నారు.