16 ఏళ్ళ వయసు, డ్యాన్స్ చేయలేక షూటింగ్ నుంచి పారిపోయిన హీరోయిన్.. చిరంజీవి ఏం చేశారో తెలుసా..

First Published | Nov 13, 2024, 7:17 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎందరో గొప్ప నటీమణులతో నటించారు. వారిలో కొందరు స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. మరికొందరు అద్భుతమైన నటనతో మెప్పించినప్పటికీ మరుగునపడిపోయారు. అలాంటి వారిలో సీనియర్ నటి పూర్ణిమ ఒకరు. 

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎందరో గొప్ప నటీమణులతో నటించారు. వారిలో కొందరు స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. మరికొందరు అద్భుతమైన నటనతో మెప్పించినప్పటికీ మరుగునపడిపోయారు. అలాంటి వారిలో సీనియర్ నటి పూర్ణిమ ఒకరు. పూర్ణిమ 80 వ దశకంలో చాలా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలు, సూపర్ హిట్స్ చాలా ఉన్నాయి. 

నరేష్ తో కలసి శ్రీవారికి ప్రేమలేఖ లాంటి క్లాసిక్ మూవీలో నటించింది. ఆ చిత్రంలోని 'తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు' అనే పాట మహిళలకి ఇప్పటికీ ఫేవరిట్ సాంగ్ గా ఉంటుంది. అదే విధంగా చిరంజీవితో కలసి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే చిత్రంలో నటించింది. అప్పటి సంగతులని గుర్తు చేసుకుంటూ పూర్ణిమ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 


నేను 14 ఏళ్ళ అతి చిన్న వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. నేను నా మొదటి చిత్రం ముద్ద మందారం చిత్రంలో నటించేటప్పుడు నా వయసు 14 ఏళ్ళు మాత్రమే. ఆ తర్వాత చిరంజీవితో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, నరేష్ తో శ్రీవారికి ప్రేమలేక చిత్రాలు చేస్తప్పుడు 15, 16 ఏళ్ళు ఉండేవి. చాలా చిన్న పిల్లని. డైరెక్టర్స్ ఏం చెబితే అది చేయాల్సిందే. సొంతంగా నేనేమి చేయలేను. కానీ డ్యాన్స్ అంటే నాకు చచ్చేంత భయం. 

ఒకరోజు షూటింగ్ లో డ్యాన్స్ సరిగ్గా చెయ్యట్లేదు డ్యాన్స్ మాస్టర్ ఇష్టం వచ్చినట్లు తిట్టేశారు. భయంతో షూటింగ్ నుంచి ఎవరికీ చెప్పకుండా పారిపోయా. ముందు నన్నుహీరోయిన్ గా తీసుకునేటప్పుడు డ్యాన్స్ ఏమి లేదు అని చెప్పి తీసుకున్నారు. దీనితో నన్ను వెతికి తీసుకువచ్చారు. డైరెక్టర్ గారు ఆ అమ్మాయిని ఎవరూ ఏమీ అనొద్దు అని చెప్పి తిరిగి షూటింగ్ కి ఒప్పించారు. 

ఆ టైంలో చిరంజీవి గారు నన్ను చాలా సపోర్ట్ చేశారు. డ్యాన్స్ అంటే భయపడకు.. నేను కొన్ని సింపుల్ స్టెప్స్ వేస్తాను చూడు అని చాలా ఓపిగ్గా నాకు కొన్ని స్టెప్పులు నేర్పించారు. షూటింగ్ లో నన్ను చిరంజీవి పూరి పూరి అని పిలుస్తూ ఏడిపించేవారు. నేను మాత్రం చిరు అని పిలిచేదాన్ని. అప్పటికీ నాకు డ్యాన్స్ సరిగ్గా రాలేదు శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో కూడా సరిగ్గా డ్యాన్స్ చేయకపోవడంతో తిట్లు తిన్నా అని పూర్ణిమ అప్పటి విషయాలు గుర్తు చేసుకున్నారు. 

Latest Videos

click me!