సౌందర్యతో ఆ సీన్ చేయనని పట్టుబట్టిన రమ్యకృష్ణ, దర్శకుడు ఏం చేశాడంటే?

First Published | Nov 13, 2024, 6:54 PM IST

పడయప్ప మూవీ రజినీకాంత్ కెరీర్ లో అతిపెద్ద హిట్. ఈ మూవీలో లేడీ విలన్ రోల్ చేసిన రమ్యకృష్ణ ఓ సీన్ చేయనని పట్టుబట్టిందట. 
 

Padayappa

90లలో సంచలన విజయాలు నమోదు చేశాడు దర్శకుడు కే ఎస్ రవికుమార్. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. రజినీకాంత్ తో ఆయనది సక్సెస్ఫుల్ కాంబినేషన్. ముఖ్యంగా ముత్తు, పడయప్ప బాక్సాఫీస్ షేక్ చేశాయి. తెలుగులో నరసింహ గా విడుదలైన పడయప్ప చిత్రానికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. 

Ramyakrishna

రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్స్ గా నటించారు. శివాజీ గణేశన్ కీలక రోల్ చేశాడు. రమ్యకృష్ణది పూర్తిగా నెగిటివ్ రోల్. హీరోయిన్ అనడం కంటే లేడీ విలన్ అని చెప్పొచ్చు. నీలాంబరిగా ఆ చిత్రంలో రమ్యకృష్ణ నటన ఎవర్ గ్రీన్. బాహుబలి మూవీలో శివగామి పాత్ర దక్కేందుకు ఆ నీలాంబరి పాత్ర కూడా ఒక కారణం. 

పగతో రగిలిపోయే అహంకారంతో కూడిన మహిళ పాత్రలో రమ్యకృష్ణ జీవించింది. అసలు రజినీకాంత్ ని కూడా డామినేట్ చేసేలా నీలాంబరి పాత్ర ఉంటుంది. కాగా ఈ పాత్రకు మొదట నగ్మా, మీనాలలో ఒకరిని అనుకున్నారట. మీనా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందట. చిరంజీవి హీరోగా నటించిన స్నేహం కోసం మూవీలో మీనా రోల్ నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది. 

Latest Videos


Ramyakrishna

అయితే ఆ పాత్ర ఆమెకు సెట్ కాలేదు. మీనా ఫేస్ సాఫ్ట్ క్యారెక్టర్స్  కి మాత్రమే సెట్ అవుతుంది.  నీలాంబరి పాత్రకు మీనా కరెక్ట్ కాదని నిర్మాతలకు కే ఎస్ రవికుమార్ చెప్పారట. అప్పుడు రమ్యకృష్ణకు పడయప్పలో ఛాన్స్ వచ్చిందట. కాగా సౌందర్య నీలాంబరి ఇంట్లో పనిమనిషి పాత్ర చేసింది. తాను ఇష్టపడే హీరో...  పనిమనిషిని ప్రేమించడం నీలాంబరికి నచ్చదు. 

కాగా ఈ మూవీలో ఓ సన్నివేశంలో రమ్యకృష్ణ తన కాలు సౌందర్య భుజం మీద పెట్టి పాదంతో ముఖాన్ని తాకుతుంది. ఈ సన్నివేశం అసలు చేయనని రమ్యకృష్ణ పట్టుబట్టారట. సౌందర్య స్టార్ హీరోయిన్, మరో ప్రక్క రజినీకాంత్ స్టార్ హీరో. నేను అలా సౌందర్య ముఖాన్ని కాలితో తాకడం సరికాదని రమ్యకృష్ణ అన్నారట. 

ఏం కాదు చేయండని దర్శకుడు కే ఎస్ రవికుమార్, సౌందర్య ఎంకరేజ్ చేశారట. చివరికి రమ్యకృష్ణ కాలిని సౌందర్య పట్టుకుని తన భుజం మీద పెట్టుకుందట. అయిష్టంగానే ఆ సీన్ లో రమ్యకృష్ణ నటించిందట. నేను ఊహించినదానికి రెండు రెట్లు నీలాంబరి పాత్రకు రమ్యకృష్ణ న్యాయం చేసిందని కే ఎస్ రవికుమార్, అన్నారు.


రజినీకాంత్ ఫ్యాన్స్ రమ్యకృష్ణను తిట్టుకున్నారట. న్యూట్రల్ ఆడియన్స్ సినిమాకు రావడం మొదలుపెట్టాక రమ్యకృష్ణకు ఎంతో పేరు వచ్చిందట. ఆమె గొప్పగా చేశారని అన్నారట. 1999లో పడయప్ప తమిళ తెలుగు భాషల్లో విడుదల చేశారు. తెలుగులో సైతం భారీ విజయం అందుకుంది. ఒక స్టార్ హీరో స్ట్రెయిట్ సినిమా కోసం ఎగబడినట్లు ఆడియన్స్ థియేటర్స్ కి పోటెత్తారు. 

ఓ ఇంటర్వ్యూలో కే ఎస్ రవికుమార్ ఈ విశేషాలు పంచుకున్నారు. మీనా, నగ్మా చేయాల్సిన నీలాంబరి పాత్ర అనుకోకుండా రమ్యకృష్ణ చేతికి వెళ్ళింది. ఆమె కెరీర్ కి మైలేజ్ ఇచ్చింది. 

click me!