OTT Movies: ఒకే రోజు ఓటీటీలోకి 47 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు.. తెలుగు మూవీస్‌ ఇవే.. నవ్వులే నవ్వులు

Published : Mar 14, 2026, 01:39 PM IST

OTT Movies: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 47 సినిమాలు, సిరీస్‌లు విడుదలయ్యాయి. ఆడియెన్స్ కి పండగని తీసుకొచ్చాయి. వీటిలో తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. కామెడీ చిత్రాలతోపాటు, హార్ట్ టచ్చింగ్‌ లవ్‌ స్టోరీ కూడా ఉంది. 

PREV
15
ఈ వారం ఓటీటీలో సందడి చేస్తోన్న 47 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు

సినిమా రిలీజ్‌లు శుక్రవారమే కాదు, గురువారం కూడా వస్తున్నాయి. ఓటీటీలోనూ అదే జరుగుతుంది. గురువారం, శుక్రవారం ఓటీటీలోనూ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు వస్తున్నాయి. ఆడియెన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతున్నాయి. ఈ క్రమంలో ఈ వారం(మార్చి 12, 13) ఓటీటీలోకి ఏకంగా 47 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు రిలీజ్‌ కావడం విశేషం. ఇందులో అన్ని భాషల చిత్రాలు, సిరీస్‌లున్నాయి. అదే సమయంలో ఐదు ఫ్లాట్‌ ఫామ్‌లో ఒకేసారి ఇన్ని సినిమాలు, సిరీస్‌లు రావడం విశేషం. అందులో తెలుగుకి చెందిన అదిరిపోయే కామెడీ సినిమాలున్నాయి. అలాగే ఒక గుండెని కదిలించే లవ్‌ స్టోరీ కూడా ఉంది.

25
నెట్‌ ఫ్లిక్స్ లో

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాల్లో `ఫంకీ` ప్రధానంగా ఉంది. నెట్‌ ఫ్లిక్స్ లో రిలీజ్‌ అయిన ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌ జంటగా నటించారు. నరేష్‌ కీలక పాత్ర పోషించారు. అనుదీప్‌ రూపొందించిన ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైంది. థియేటర్లో డిజప్పాయింట్‌ చేసింది. ఇప్పుడు శుక్రవారం ఓటీటీలో సందడి చేస్తోంది. మంచి ఆదరణే రాబట్టుకుంటోంది. వీటితోపాటు నెట్‌ ఫ్లిక్స్ లో విడుదలైన సినిమాలు, సిరీస్‌లు చూస్తే.

సినిమాలు

`మేడ్‌ ఇన్‌ కొరియా`(తమిళం)

పెన్నుమ్‌ పొరట్టుమ్‌(మలయాళం)

గ్లాడియేటర్‌(ఇంగ్లీష్‌)

దట్‌ నైట్‌(ఇంగ్లీష్‌)  

వెబ్‌ సిరీస్‌లు

వన్‌ పీస్‌ సీజన్‌ 2 (ఇంగ్లీష్‌)

వర్జిన్‌ రివర్‌ సీజన్‌ 7 (ఇంగ్లీష్‌)

లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ ది రీయూనియన్‌ (ఇంగ్లీష్‌)

ఏజ్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ సీజన్‌1 (ఇంగ్లీష్‌)

ఈసేమ్‌ స్ట్రీట్‌ వాల్యూమ్‌ 2 (ఇంగ్లీష్‌)

ఫతల్‌ సెడక్షన్‌ సీజన్‌ 3 (ఇంగ్లీష్‌)

దట్‌ నైట్‌ సీజన్‌ 1 (స్పానిష్‌)

డైనాస్టీ ది మర్డోక్‌ సీజన్‌ 1 (ఇంగ్లీష్‌-డాక్యుమెంటరీ)

బర్బారా బికమింగ్‌ ఇరిన్‌ డేవిడ్‌ (జర్మనీ -డాక్యుమెంటరీ)

35
అమెజాన్‌ ప్రైమ్‌లో

ప్రైమ్‌లో ఈ వారం వచ్చిన చిత్రాల్లో తెలుగు లవ్‌ స్టోరీ `కపుల్‌ ఫ్రెండ్లీ` ఉంది. సంతోష్‌ శోభన్‌, మానస వారణాసి జంటగా నటించిన చిత్రమిది. యూవీ కనెక్ట్స్ నిర్మించింది. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అజయ్‌ నిర్మించారు. ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పుడు ప్రైమ్‌ ఆడియెన్స్ ని మెప్పిస్తోంది. వీటితోపాటు ప్రైమ్‌లోకి ఈ వారం వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఏంటనేది చూస్తే.

సినిమాలు

పెన్ను కేస్‌(మలయాళం)

ధీరమ్‌(మలయాళం)

యోగిడ(తమిళం)

సింగమ్‌ రిటర్న్స్(హిందీ)

రాణపతి శివ్రే స్వరి అగ్ర(మరాఠి)

యానివర్సరీ(ఇంగ్లీష్‌)

వెబ్‌ సిరీస్‌లు

లోకల్‌ టైమ్స్(తమిళం)

సంకల్ప్(హిందీ)

ఆస్పిరెంట్‌ సీజన్‌ 3(హిందీ)

స్కార్పెట్టా(ఇంగ్లీష్‌)

వైట్‌ నైట్‌ సీజన్‌ 1(ఇంగ్లీష్‌)

డే వన్‌ సీజన్‌ 1(ఇంగ్లీష్‌)

డే వన్‌ సీజన్‌ 1(స్పానిష్‌)

గింటమా సీజన్‌ 1(ఇంగ్లీష్‌-యానిమేషన్‌)

మెలానియా(ఇంగ్లీష్‌-డాక్యుమెంటరీ)

45
జీ 5లో

రవితేజ హీరోగా, డింపుల్‌ హయతీ, ఆషికా రంగనాథ్‌ కలిసి నటించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ స్ట్రీమింగ్‌ అవుతుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. సంక్రాంతి బరిలో దిగినా అంతగా ఆడలేదు. ఇప్పుడు ఓటీటీలో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. దీంతోపాటు `పూకీ` అనే తమిళ సినిమా, ది ల్యాండ్‌ లార్డ్ అనే కన్నడ మూవీ, `అంధ్‌ ప్యార్‌ 2` అనే హిందీ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి.

జియో హాట్‌ స్టార్‌

సినిమాలు

జూటోపియా 2(ఇంగ్లీష్‌)

ది ఫ్యామిలీ మెక్‌ ముల్లెన్‌(ఇంగ్లీష్‌)

వెబ్‌ సిరీస్‌లు

రిసార్ట్(తమిళం)

ది సొసైటీ సీజన్‌ 2(హిందీ)

రూస్టర్‌(ఇంగ్లీష్‌)

ది మేడిసన్‌(ఇంగ్లీష్‌)

ది క్యాప్చర్‌ సీజన్‌ 3(ఇంగ్లీష్‌)

55
ఈటీవీ విన్‌లో

శివ కందుకూరి, తేజు అశ్విని జంటగా రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రలో నటించిన `నవాబ్‌ కేఫ్‌` మూవీ ఫ్యామిలీ, ఎమోషనల్‌ డ్రామాగా రూపొందింది. వారసత్వంగా వచ్చిన ఛాయ్‌ గొప్పతనాన్ని తెలియజేస్తూ రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్‌ లో ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. దీనికి కూడా మంచి ఆదరణే దక్కుతోంది.

సన్‌ నెక్ట్స్ లో

ఫ్రైడే(తమిళం)

సుక్రం(మలయాళం) చిత్రాలు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి.

లయన్స్ గేట్‌ ప్లేలో

ఇందులో ఈ వారం `హాట్‌ స్పాట్‌ 2 మచ్‌` అనే తెలుగు సినిమా, `ది తాజ్‌ స్టోరీ` అనే హిందీ మూవీ, `టర్బులెన్స్` అనే ఇంగ్లీష్‌ ఫిల్మ్, `షాక్‌ అండ్‌ ఆ` అనే ఇంగ్లీష్‌ సినిమా ఈ వారం స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. మొత్తంగా 47 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లో ఈ వారం ఓటీటీ ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories