ఢీ వేదికపై చిలిపి చిత్రం, ఆ ఫీలింగ్ ఆపుకోలేక డాన్సర్ బుగ్గ కొరికిన జడ్జి పూర్ణ... అందరి మైండ్ బ్లాక్

First Published Jul 30, 2021, 1:01 PM IST

జడ్జి లందు ఢీ షో జడ్జిలు వేరయా అన్నట్లు ఉంది తీరు. ముద్దులు, హగ్గుల నుండి ఏకంగా బుగ్గలు కొరికే దాకా వెళ్ళింది వీరి జోరు. లేటెస్ట్ ఢీ ఎపిసోడ్ లో పూర్ణ చేసిన రచ్చ షోలో ఉన్న వారితో పాటు ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసింది.

టీవీలో ప్రసారమయ్యే ఢీ షోకి భయంకరమైన పాపులారిటీ ఉంది . అత్యధిక టీఆర్పీ కలిగి టాప్ షోగా ఉన్న ఢీలో డాన్స్ తో పాటు రొమాన్స్, కామెడీ అదనపు ఆకర్షణలు. యాంకర్స్ తో యాంకర్స్, యాంకర్స్ తో జడ్జెస్, జడ్జెస్ తో డాన్సర్స్... తారతమ్యం లేకుండా ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతూ ఉంటారు.
undefined
ప్రియమణి, పూర్ణ జడ్జెస్ గా ఎంట్రీ ఇచ్చాక ఢీ షోలో ముద్దుల సాంప్రదాయం ఎక్కువయిపోయింది. మనసులు దోచుకునే విధంగా ఎవరైనా డాన్స్ పెరఫార్మెన్సు ఇస్తే, మొహమాటం లేకుండా గుండెలకు హత్తుకుంటుంది ప్రియమణి.
undefined
అలాగే యాంకర్ ప్రదీప్, ఆది తో కూడా ఆమె రొమాన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రేమ లేఖ రాసిన ఆది ఒడిలో కూర్చొని ఆమె పిచ్చ రొమాంటిక్ గా వ్యవహరించారు. గతంలో కేవలం రష్మీ, సుధీర్ మధ్య మాత్రమే రొమాన్స్ ఉండేది.
undefined
పూర్ణ, ప్రియమణి డాన్సర్స్, యాంకర్స్ తో కూడా రొమాన్స్ చేస్తూ షోకి మరింత మసాలా జోడించే ప్రయత్నం చేస్తున్నారు. ఢీ షో జడ్జెస్ చర్యలు ఊహాతీతంగా ఉంటుండగా, తాజాగా పూర్ణ ఏకంగా ఓ డాన్సర్ బుగ్గలు కొరికారు.
undefined
ఎపిసోడ్ లో భాగంగా ఓ డాన్సర్ బేబీ గెటప్ లో ఎస్పీ బాలు హిట్ సాంగ్.. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. సాంగ్ పర్ఫార్మ్ చేశారు. సదరు డాన్సర్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి పడిపోయిన పూర్ణ తెగ ఎంజాయ్ చేశారు.
undefined
పెర్ఫార్మన్స్ అనంతరం చైర్ లోనుండి వేదికపైకి వెళ్లి సదరు డాన్సర్ మెత్తని బుగ్గలు కొరికారు. ఈ సీన్ అందరికీ షాక్ ఇచ్చింది. దీనితో ముద్దులు, హగ్గులు దాటిపోయి వీరు ఏకంగా బుక్కలు కొరికే వరకు వెళ్లిపోయారని అందరూ అనుకుంటున్నారు.
undefined
తాజా ఢీ ప్రోమోలో ఈ సంచలన విషయాలు చోటు చేసుకున్నాయి. ఎప్పటిలాగే ఆది , ప్రదీప్, సుధీర్ మధ్య నాన్ స్టాప్ పంచ్ ల కామెడీతో షో సాగినట్లు అర్థం అవుతుంది.
undefined
ఇక ఢీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా ఏమేమి సంచలన సంఘటనలు చోటు చేసుకున్నాయో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.
undefined
click me!