ఆ తర్వాత సీన్లో కార్తీక్ ఇంట్లో కూర్చుని ఉండగ మొనిత,కార్తీక్ కి అన్నం పెడుతూ ఉంటుంది. వెనకాతల మొనిత, కార్తీక్ పూజ చేస్తున్నట్టు ఒక ఫోటో ఉంటుంది. అప్పుడు కార్తీక్ నీ పేరేంటి అని అడుగుతాడు దానికి మొనిత, నువ్వు ఎన్ని మర్చిపోయిన నేను నీకు మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంటాను కార్తీక్. నా పేరు మొనిత అని అంటుంది. అసలు నువ్వు నిజంగానే నా భార్యవా? ఇంట్లో ఉన్న ఒక ఫోటో తప్ప నాకు ఇంకేమీ గుర్తురావడం లేదు. మనం నిజంగానే బోటిక్ చాలా ఏళ్ల నుంచి నడుపుతున్నామా? నాకు చిన్న గుర్తు కూడా రావడం లేదు అని అనగా, పరాయి మగాడిని ఇంటికి తెచ్చుకొని భర్తని చెప్పడానికి నాకేంటి అవసరం కార్తీక్.