మతం పేరుతో దూరం పెట్టొద్దు.. నేనూ తెలంగాణ బిడ్డనే.. కన్నీళ్లు పెట్టుకున్న నటి పూనమ్ కౌర్!

First Published | Mar 7, 2023, 11:24 AM IST

రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి అతిథిగా హాజరైంది నటి పూనమ్ కౌర్ (Poonam Kaur). ఈ సందర్భంగా తనను మతం పేరుతో దూరం పెడుతున్నారని భావోద్వేగమయ్యారు. 
 

టాలీవుడ్ తోనే తన కేరీర్ ను ప్రారంభించిన నటి పూనమ్ కౌర్.. అటు తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. కొన్నేండ్లు తెలుగులో పూనమ్ కౌర్ హీరోయిన్ గా కాకుండా ముఖ్య పాత్రల్లో నటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 
 

అయితే తాజాగా తెలంగాణలోని రాజ్ భవన్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) కార్యక్రమానికి ఆమె హాజరైంది. ఈ సందర్భంగా వేదికపై మహిళా దినోత్సవంపై తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు. 
 

Latest Videos


ఈక్రమంలో వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు నటి పూనమ్ కౌర్.. ఆమె మాట్లాడుతూ.. తాను తెలంగాణ బిడ్డనేనని, కానీ తనను పంజాబీ అమ్మాయి అంటూ దూరం పెడుతున్నారంటూ వేదికపై కన్నీళ్లు పెట్టుకుంది. మతం పేరుతో నన్ను వెలివేయకండి. నేనూ తెలంగాణ బిడ్డనే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

దయచేసి మైనార్టీ అని, సిక్కు అని వేరు చేయొద్దంటూ భావోద్వేగమయ్యారు. అలాగే మెడికల్ స్టూడెంట్ ప్రీతీ ఘటనపైనా  స్పందించారు. ఆమెకు జరిగింది అన్యాయమని.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. 

రాజ్ భవన్ లోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పూనమ్ కౌర్ కామెంట్స్ వైరల్ గా మారాయి.  ఇక పూనమ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా పోస్టులు పెడుతూ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంటారు. 

సినిమాల విషయానికొస్తే పూనమ్ కౌర్ కు పెద్ద అవకాశాలు లేవు. తెలుగుతో పాటు అటు హిందీలోనూ అదే పరిస్థితి ఉంది. హీరోయిన్ గా అవకాశాలు అందడం కష్టమైంది. దీంతో వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటోంది.  గతేడాది తెలుగులో ‘నాతిచరామి’ చిత్రంతో అలరించింది. 
 

click me!