బెడ్ పై పిల్లోని నలిపేస్తూ.. క్యూట్ గా ముద్దులిస్తూ పాయల్ రాజ్ పుత్ రచ్చ.. ఇంత హ్యాపీనెస్ ఎందుకంటే..

First Published | Jul 5, 2023, 5:24 PM IST

‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన పాయల్ వరుస చిత్రాలతో అలరించింది. మరోసారి తనను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడితోనే సినిమా చేస్తోంది. రీసెంట్ గా వచ్చిన టీజర్ అదిరిపోయింది.
 

దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. కార్తీకేయ - పాయల్ జంటగా నటించారు. ఈ చిత్రంతో పాయల్ రాజ్ పుత్ కు మాత్రం మంచి క్రేజ్ దక్కింది. తొలిసినిమాతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో మతులుపోగొట్టింది. 
 

దాంతో టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందుకుంది పాయల్. కానీ తొలి చిత్రం అందించిన రిజల్ట్ ను పాయల్ మరే చిత్రం అందుకోలేకపోయింది. వెంకటేష్, రవితేజ సరసన నటించినా ఫలితం లేకుండా పోయింది. మళ్లీ సాలిడ్ హిట్ పడితే గానీ ఈ ముద్దుగుమ్మ కెరీర్ స్పీడ్ అయ్యే అవకాశం లేదంటున్నారు. 
 


ఈ క్రమంలో పాయల్ మరోసారి తనకు టాలీవుడ్ లోకి దారి చూపించిన అజయ్ భూపతి దర్శకత్వంలో నటిస్తోంది. వీరి కాంబోలో ‘మంగళవారం‘ (Mangalavaaram) చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా టీజర్ కూడా విడుదలై ఆకట్టుకుంటోంది. 

గ్రామీణ నేపథ్యంలో నేటివిటీతో కూడిన కథతో తీస్తున్న చిత్రమిది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. ప్రేక్షకులకు థియేటర్లలో కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందని దర్శకుడు తెలిపారు. అయితే టీజర్ కు మాత్రం మంచి రెస్పాన్స్ రావడంతో పాయల్ తాజాగా అందరికీ థ్యాంక్స్ చెప్పింది. 
 

తనను ఎప్పుడూ ఆదరిస్తున్నందుకు, మద్దుతుగా ఉంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా ఓ మీడియోను కూడా పంచుకుంది. రీసెంట్ గా ఓ గదిలో కాస్తా బోల్డ్ గా చేసిన ఫొటోషూట్ కు సంబంధించిన వీడియోను పంచుకుంది. 

ఈ వీడియోలో పాయల్ కేవలం టీషర్ట్ లోనే దర్శనమిచ్చింది. థైస్ షో చేస్తూ మతులు పోగొట్టింది. పింక్ పిల్లో అడ్డుపెట్టుకొని ఫొటోలకు చిలిపిగా ఫోజులిచ్చింది. ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ.. మత్తెక్కించేలా స్టిల్స్ ఇస్తూ అట్రాక్ట్ చేసింది. మొత్తానికి క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. 
 

Latest Videos

click me!