రామ్ చరణ్, నాగచైతన్యపై తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఇండస్ట్రీలో వాళ్లు మాత్రం అంటూ..

First Published | Jul 5, 2023, 3:55 PM IST

టాలీవుడ్ లో మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ఎంతో మంది బడా హీరోల సరసన నటించింది. అయితే తాజాగా రామ్ చరణ్, నాగ చైతన్యపై తొలిసారిగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 
 

స్టార్ హీరోయిన్, మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia)  టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు ఊపూపిన విషయం తెలిసిందే. తెలుగులో చిన్న హీరోల నుంచి టాప్ స్టార్స్ సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సందడి చేస్తోంది. ఇటు సౌత్ సినిమాల్లోనూ నటిస్తోంది.
 

రీసెంట్ గా తమన్నా భాటియా హిందీలో ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ వంటి సిరీస్ ల్లో నటించిన విషయం తెలిసిందే. అవి ప్రస్తుతం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో తమన్నా ఏకంగా మునుపెన్నడూ లేని విధంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తో మతులు పోగొట్టింది. ఈ సిరీస్ తర్వాత మరింత హాట్ టాపిక్ గ్గా మారింది.
 


అయితే, రీసెంట్ గా తమన్నా ఓ ఇంటర్వ్యూల్లో తెలుగు హీరోల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya)లపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

బాలీవుడ్ హీరోలతో సౌత్ హీరోలను పోల్చిన సందర్భంగా చెర్రీ, చైతూలపై తమన్నా ఇలా మాట్లాడింది. రామ్ చరణ్ మరియు నాగచైతన్య తమ కోస్టార్స్ చాలా మర్యాదపూర్వకంగా ఉంటారు. సెట్స్ లో వారితో యాక్ట్రెస్ చాలా సౌకర్యవంతంగా ఉంటారని చెప్పుకొచ్చింది. వారిద్దరితో కలిసి వర్క్ చేయడం బాగా నచ్చుందని కూడా చెప్పింది. 
 

తమన్నా - రామ్ చరణ్ కాంబోలో ‘రచ్చ’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇక చైతూ - తమన్నా కాంబోలో ‘100% లవ్’, ‘తడాక’ చిత్రాలు వచ్చాయి. తెలుగులో గతేడాది ‘గని’, ‘ఎఫ్3’, ‘గుర్తుందా శీతాకాలం’ వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం సౌత్ సినిమాలతోనే సందడి చేయబోతోంది.
 

మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా ‘భోళా శంకర్’లో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రజినీకాంత్ సరసన ‘జైలర్’లోనూ నటిస్తోంది. అలాగే తమిళంలో ‘అరణ్మనై 4’, ‘బంద్రా’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
 

Latest Videos

click me!