‘హరిహర వీరమల్లు’పై తన మనసులో మాట చెప్పిన నిధి అగర్వాల్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్

First Published | Jul 17, 2023, 11:32 AM IST

యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal)  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈచిత్రంపై నిధి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. 
 

తెలుగు హీరోయిన్ నిధి అగర్వాల్ ‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి హిట్ ను అందుకుంది. బాలీవుడ్ చిత్రం ‘మున్నా మైఖేల్’తో కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ  ప్రస్తుతం దక్షిణాది ప్రేక్షకులనే అలరిస్తోంది. వరుస చిత్రాలతో అలరించబోతోంది. 
 

గతేడాది ‘హీరో’, ‘కలగ తలైవన్’లో నటించింది. కానీ ఆ చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో తెరకెక్కబోతున్న పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘హరిహార వీరమల్లు’లో నటిస్తోంది. ప్రొడ్యూసర్ ఏంఎం రత్నం నిర్మిస్తున్నారు. 
 


రెండేళ్ల కిందనే ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, కరోనా, పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్, తదితర అంశాల కారణంగా  ఆలస్యం అవుతూ వచ్చింది. ఆ మధ్యలో అప్డేట్స్ ఇచ్చారు. కొద్దిరోజులుగా ఈ సినిమా గురించి న్యూసే  లేదు. 
 

ఈ క్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘హరిహార వీరమల్లు’ పోస్టర్ ను పంచుకుంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేసింది. కాస్తా బ్లర్ చేసిన పోస్టర్ ను అభిమానులతో పంచుకుంటూ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకుంది.
 

నోట్ రాస్తూ.. ‘కల నిజమైంది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్, డైరెక్టర్ క్రిష్ సార్, ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సార్ ల కాంబోలో రాబోయే హరిహర వీరమల్లు నటించడం ఆనందగా ఉ:ది. ఈ సినిమా ఎపిక్ జర్నీలో భాగమైనందుకు కృతజ్ఞతలు. అద్భుతమైన టీమ్ తో కలిసి పనిచేయడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. త్వరలో మీ ముందుకు మ్యాజిక్ రాబోతుంది‘ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే రొమాంటిక్ పోస్టర్ ను పంచుకుంది. అది తన ఫస్ట్ డే షార్ట్ అని చెప్పింది. 

కొద్దినెలలుగా ‘హరిహర వీరమల్లు‘పై ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఈ చిత్రం పరిస్థితి ఏంటనేది అందరిలో సందేహం కలిగించింది. ఇక తాజాగా నిధి అగర్వాల్ పోస్ట్ పెట్టడంతో తర్వలో అప్డేట్స్ రానున్నాయని పరోక్షంగా అర్థం అవుతోంది. 
 

Latest Videos

click me!