ఎర్ర చీరకట్టి.. నెమలిలా నాట్యం చేస్తున్న దివి.. చీరకట్టులో మంత్రముగ్ధులను చేస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ

First Published | Jul 17, 2023, 10:11 AM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ దివి (Divi)  రోజుకో తీరుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా చీరకట్టులో మెరిసిన ఈ ముద్దుగుమ్మ మమూరిలా నాట్యం చేస్తూ కట్టిపడేస్తోంది. ఎర్రచీరలో మెరిసిపోయింది. 
 

నటి దివి బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ నెట్టింట సందడి చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. సినిమా విషయాలను పంచుకోవడంతో పాటు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. 
 

‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షోతో దివికి మంచి క్రేజ్ దక్కింది. సీజన్ 4తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చివరి వరకు మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. తనదైన శైలిలో అన్ని టాస్క్ ల్లో పాల్గొని టీవీ ఆడియెన్స్ ను అలరించింది. టైటిల్ అందుకోలేపోయిన మంచి క్రేజ్ సొంతం చేసకుంది. 
 


ఇక హౌజ్ నుంచి బయటికి వచ్చాక ఈ ముద్దుగుమ్మకు సినిమాల్లో వరసగా ఆఫర్లు దక్కుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ వస్తోంది. తన దగ్గరకు వచ్చిన ఈ చిన్న పాత్రను కూడా వదులుకోవడం లేదు. కెరీర్ ను ముందుకు తీసుకెళ్లేందుకు సరిగ్గా ప్లాన్ చేసుకుంటోంది. 
 

ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ‘ఏ1 ఎక్స్ ప్రెస్’, ‘మహార్షి’, ‘జిన్నా’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఇక రీసెంట్  జగపతి బాబు నటించిన ‘రుద్రంగి’లో కీరోల్ లో అలరించింది. అలాగే ఓ ఓటీటీ సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా వరుస చిత్రాలతో అలరిస్తోంది. 
 

బిగ్ బాస్ ద్వారా ఆడియెన్స్ కు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ఈమేరకు గ్లామర్ విందు కూడా చేస్తోంది.
 

దివి చేసే ఫొటోషూట్లు స్టన్నింగ్ గా ఉంటున్నాయి. ట్రెండీ వేర్స్ లోనైనా, ట్రెండీ వేర్స్ లోనైనా దివి నెట్టింట అడుగుపెడితే ఫ్యాన్స్ కు కన్నుల పండగనే చెప్పాలి. కిర్రాక్ ఫొటోషూట్లతో ఐఫీస్ట్ కలిగిస్తోంది. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. 

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ  చీరకట్టులో దర్శనమిచ్చింది. దివి ట్రెండీ వేర్స్ లో కంటే సంప్రదాయ దుస్తుల్లోనే ఎక్కువ కనిపిస్తుంటుంది. ట్రెడిషనల్ వేర్ లోనే ఈ బ్యూటీ చాలా అందంగా ఉంటుంది. అలానే చూసేందుకు అభిమానులు, ఫాలోవర్స్  ఇష్టపడుతుంటారు. ఈక్రమంలో తాజాగా రెడ్ శారీలో మెరిసింది.
 

ఓ బ్యూటీఫుల్ లోకేషన్ లో ఫొటోషూట్ చేసింది. సెలయేరు పారుతుండగా.. పక్కనే ఉన్న కొండపై మయూరిలా నాట్యం చేస్తూ మైమరిపించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెరుపులు మెరిపించి మతులు చెడగొట్టింది. కవ్వించే ఫోజులతో కలవరపెట్టింది. లేటెస్ట్ గా పంచుకున్న ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 
 

Latest Videos

click me!