Brahmamudi: కనకానికి అదిరిపోయే సలహా ఇచ్చిన కళ్యాణ్.. స్వప్నని హెచ్చరిస్తున్న రాహుల్!

Published : Apr 04, 2023, 12:48 PM IST

Brahmamudi : స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదిస్తూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. చెల్లెలిని అపార్థం చేసుకొని ఆమె మీద పగ సాధించాలని చూస్తున్న ఒక అక్క కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
17
Brahmamudi: కనకానికి అదిరిపోయే సలహా ఇచ్చిన కళ్యాణ్.. స్వప్నని హెచ్చరిస్తున్న రాహుల్!

ఎపిసోడ్ ప్రారంభంలో కావ్య గది తలుపు దగ్గరికి వేయడాన్ని కళ్యాణ్ గమనిస్తాడు. అది చూసిన రాజ్ ఎవరి కంట్లో అయితే పడకూడదనుకున్నానో వాడికంట్లోనే పడ్డాను అనుకుంటాడు. బయటికి చెప్పటానికి ఫీల్ అవుతావు కానీ వదిన మీద నీకు ఇష్టం ఉంది కదా, పెద్దమ్మ ఏదో అంటుందని భయపడుతున్నావు కదా అంటాడు కళ్యాణ్.అలాంటిదేమీ లేదు అంటాడు రాజ్. పెళ్లిలో ఉండే బలమే అలాంటిది పైన గదిలో ఉండే నిన్ను కిందికి దారం పెట్టి లాగినట్లుగా లాగేసింది అంటూ కవిత్వాన్ని చెప్తాడు కళ్యాణ్. 

27

ఏదేదో ఊహించుకొని ఇంట్లో వాళ్లకి ఏదేదో చెప్పకు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రాజ్. మరోవైపు ఎస్ఐ ఫోన్ చేసి స్వప్న ఎక్కడ ఉన్నది తెలిసిపోయింది అంటూ రాజ్ కి అడ్రస్ చెప్తాడు. నేను కూడా మీతో పాటు వస్తాను అని ఫోన్ పెట్టేసిన రాజ్ నేరుగా వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే అసలు విషయాలు తెలుస్తాయి అనుకుంటాడు. హాల్లోకి వచ్చిన రాజ్ గట్టిగా కేకలు వేసి కావ్యని పిలుస్తాడు. మొన్న రాత్రి ముసుగేసుకుని ఎక్కడికి వెళ్లావు అంటూ అందరి ముందు నిలదీస్తాడు. తన పేరు బయట పెట్టేస్తుందేమో అని కంగారు పడుతుంది రుద్రాణి.

37

పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను అని చెప్పి అందరికీ షాక్ ఇస్తుంది కావ్య. అర్ధరాత్రి ముసుగు వేసుకొని పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్లిందో తెలుసా వాళ్ళ అక్క కనబడట్లేదు అని కంప్లైంట్ ఇవ్వడానికి అంటూ కోపంగా చెప్తాడు  రాజ్. ఇంతవరకు ఈ ఇంటి నుంచి ఆడవాళ్లు పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టిందే లేదు అంటుంది అపర్ణ. ఇలాంటి పొరపాట్లు నువ్వు చేయటమేంటి నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా మీ అక్క గురించి అంత ఆందోళనగా ఉంటే ఇంట్లో ఎవరికైనా చెప్పాల్సింది కదా అంటూ మందలిస్తాడు సీతారామయ్య. నీ పుట్టింటి వాళ్ళతో సంబంధాలు ఉండకూడదని నేను షరతు  పెడితే మళ్లీ మీ అక్క కోసం వెళ్లడం ఏంటి అంటూ నిలదీస్తుంది అపర్ణ. 

47

 క్షమించండి నేను చేసింది తప్పే కానీ నాకు మరో మార్గం తోచలేదు. మా అక్క కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇవ్వడానికే వెళ్లాను కానీ తనతో మాట్లాడటానికి కాదు అంటుంది కావ్య. ఇంక ఆపు ఎందుకు వెళ్లినా ఈ కుటుంబానికి ద్రోహం చేసిన మనిషి కోసం వెళ్లావు అంటూ కోప్పడతాడు రాజ్. మా అక్క ఎప్పుడు సొంతంగా నిర్ణయం తీసుకోదు, ఎవరో తనని ట్రాప్ చేశారు. మా అక్క దొరికితే నిజాలు అన్నీ బయటికి వస్తాయి అంటుంది కావ్య. అయితే తప్పకుండా మీ అక్క దొరుకుతుంది ఇక్కడే మణికొండ హోటల్లో ఉన్నట్లు ఎస్సై ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తీసుకురావడానికే వెళ్తున్నాను వచ్చాక నిజాలు ఏంటో తెలుస్తాను అంటూ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు రాజ్.
 

57

మరోవైపు కళ్యాణ్ ఫోన్ చేసి స్వప్న ఎక్కడ ఉందో రాజ్ అన్నయ్యకి తెలిసిపోయింది. రాజ్ అన్నయ్య ఆవేశం చూస్తే స్వప్నని ఇక్కడికి తీసుకువచ్చి పెద్ద గొడవ చేసేలాగా ఉన్నాడు అలా చేస్తే కావ్య వదిన చిక్కుల్లో పడుతుంది అందుకే ముందుగా మీరు వెళ్లి తనని మీతో పాటు తీసుకు వెళ్లిపోండి తర్వాత సంగతి తర్వాత చూద్దాం అంటూ ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్. కనకం వెంటనే మీనాక్షికి ఫోన్ చేసి బంజర హిల్స్ పోలీస్ స్టేషన్లో నీకు ఎవరైనా తెలుసా అని అడుగుతుంది.చేస్తాను కానీ ఎక్కడ ములుగుతానో ఏంటో అంటూ కంగారు పడుతుంది మీనాక్షి. 

67

స్వప్న దొరికితే స్వప్న కళావతి ఇద్దరూ నా నుంచి తప్పించుకోలేరు అంటూ ఆవేశంగా అనుకుంటాడు రాజ్. అక్క దొరికితే పెద్ద గొడవలు అయిపోతాయి ఎలా అయినా గొడవ ఆపాలి అందుకే నేను కూడా వెళ్లాలి అనుకుంటుంది కావ్య. మరోవైపు కారులో వెళ్తున్న అక్కని ఏ జన్మ పుణ్యం అనుకో నువ్వు నాకు అక్కగా దొరికావు అంటుంది కనకం. ఏ జన్మలో చేసుకున్న పాపమో అని నేను అనుకుంటున్నాను అంటుంది మీనాక్షి. స్వప్న దొరికితే కళావతి నిజస్వరూపం ఏం చేస్తాను అనుకుంటాడు రాజ్ మరోవైపు కావ్య కూడా ఆటోలో వస్తుంది. లాడ్జి దగ్గరికి వెళ్లిన కనకం స్వప్నని  ఇంటికి తీసుకువెళ్లి దాని సంగతి తేల్చాలి అనుకుంటూ కారు దిగుతుంది.

77

 అప్పుడే కారు దిగుతున్న రాజ్ ని చూసి కంగారుగా మళ్లీ కార్ లోకి వెళ్ళిపోతుంది. ఏమైందని మీనాక్షి అడిగితే అల్లుడ్ని, పోలీస్ ని ఇద్దర్ని చూపిస్తుంది కనకం. ఇక్కడ స్వప్న ఉన్నట్టు అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏంటో అంటూ కంగారు పడిపోతుంది మీనాక్షి. మరోవైపు స్వప్నకి భోజనాన్ని తీసుకొస్తున్న రాహుల్,రాజ్ వాళ్ళని చూసి స్వప్న ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయిందా అంటూ కంగారు పడుతాడు. తరువాయి భాగంలో నువ్వు ఇక్కడ ఉన్నట్టు రాజ్ కి తెలిసిపోయింది పోలీసులతో సహా వచ్చాడు అంటూ స్వప్న కి ఫోన్ చేసి చెప్తాడు రాహుల్. షాకైన  స్వప్న బట్టలన్నీ సర్దేస్తుంది.

click me!

Recommended Stories