Namitha: బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా నమితని అసభ్యంగా అలా చేయమన్న డైరెక్టర్, రివేంజ్ తీర్చుకున్న హీరో

Published : Jun 07, 2026, 04:20 PM IST

హీరోయిన్ నమిత ఒకప్పుడు తన గ్లామర్ తో యువతని ఆకట్టుకుంది. బిల్లా, సింహా లాంటి చిత్రాల్లో నటించింది. ఆమె బాయ్ ఫ్రెండ్ పక్కన ఉన్న సమయంలోనే నమితని ఓ డైరెక్టర్ అసభ్యంగా ఇబ్బంది పెట్టిన వివాదం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
Namitha

టాలీవుడ్ లో ఒకప్పుడు గ్లామర్ పరంగా నమిత వెలుగు వెలిగింది. నమిత కొన్ని క్రేజీ చిత్రాల్లో నటించి గ్లామర్ ఒలకబోసింది. బిల్లా, సింహా లాంటి చిత్రాల్లో నమిత నటించింది. తన గ్లామర్ తోనే నమిత యువతలో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కెరీర్ బిగినింగ్ లో నమిత విషయంలో కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి.

25
నమితపై డైరెక్టర్ కామెంట్స్

సీమశాస్త్రి, దేనికైనా రెడీ, 6 టీన్స్ లాంటి విజవంతమైన సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి, నమిత మధ్య పెద్ద వివాదం చోటు చేసుకుంది. ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి మూవీ షూటింగ్ లో గొడవ జరిగింది. తెలుగులో నమితకి ఇది రెండవ చిత్రమే. ఓ ఇంటర్వ్యూలో నాగేశ్వర రెడ్డి.. నమిత గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. షూటింగ్ సమయంలో మీరు నమితని కొట్టినట్లు, ఇష్టం వచ్చినట్లు తిట్టినట్లు ప్రచారం జరిగింది. ఇది నిజమేనా అని ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారు.

35
నమితని నేను కొట్టలేదు

నమితని నేను కొట్టలేదు. నమితని మాత్రమే కాదు ఏ హీరోయిన్ తో కూడా నేను రూడ్ గా బిహేవ్ చేయలేదు. నేను సినిమా కోసమే ఇండస్ట్రీలో ఉన్నాను. ఆమె కూడా సినిమా కోసమే ఇండస్ట్రీకి వచ్చింది. కాబట్టి సినిమాకి ఏది అవసరం అయితే అది చేయాలి. చెప్పింది చేయనప్పుడు నాకు కోపం వస్తుంది. ఆ కోపంలో కాస్త అరిచిన మాట వాస్తవమే. అక్కడ చిన్న గొడవ జరిగింది. అంతే కానీ కొట్టలేదు అని నాగేశ్వర రెడ్డి అన్నారు. ఈ చిత్రాల్లో శ్రీరామచంద్ర సిగ్గే గోవిందా అనే సాంగ్ ఉంది. ఈ సాంగ్ లో డ్యాన్స్ మాస్టర్ ఒక డ్యాన్స్ మూమెంట్ కంపోజ్ చేశారు, ఆ మూమెంట్ చాలా బావుంటుంది. కానీ నమితకు అది ఎందుకో అసభ్యంగా అనిపించింది. చేయను అని మొండికేసింది. నేను చూసిన హీరోయిన్లలో నమిత చాలా లేజీ హీరోయిన్. దేనికీ వెంటనే స్పందించదు.

45
దానికోసమే నన్ను ఇబ్బంది పెడుతున్నారు

గ్యాప్ దొరికితే వెళ్లి పడుకుంటుంది. మళ్ళీ పిలిస్తే కానీ రాదు. దర్శకుడు, హీరో ఎవ్వరితో మాట్లాడదు. ఆ డ్యాన్స్ మూమెంట్ నువ్వు చేయాల్సిందే అని నేను పట్టుపట్టా. దీనితో ఆమె ఒక రకంగా మాట్లాడడం మొదలుపెట్టింది. మీరు నా నుంచి ఇంకేదో ఆశిస్తున్నారు. దాని కోసమే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఓపెన్ గా మాట్లాడేసింది. నమిత ఇంత చెడు గా ఎందుకు ఆలోచించిందో, డ్యాన్స్ చేయమన్నందుకు ఆమెకి ఇలా ఎందుకు అర్థం అయిందో నాకు అర్థం కాలేదు.

55
జోక్యం చేసుకున్న నమిత బాయ్ ఫ్రెండ్

అప్పట్లో ఆమెకి కపూర్ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. ఎప్పుడూ నమితతోనే ఉండేవాడు. అందరూ అతడిని ఆమె బాయ్ ఫ్రెండ్ అనే అనుకున్నారు. ఆ రోజు కూడా సెట్స్ లోనే ఉన్నాడు. మంచి కుర్రాడు. అతడిని వెంటనే పిలిపించా. డ్యాన్స్ చేయమన్నందుకు నమిత ఇలా అంటోంది అని చెప్పా. దీనితో అతడు నమితని పక్కకు తీసుకువెళ్లి ఆమెని కన్విన్స్ చేశాడు. చివరికి నమిత అంగీకరించింది. ఆ డ్యాన్స్ మూమెంట్ ఆమె హీరో శ్రీకాంత్ తో చేయాలి. మొదట ఆమె చేయను అన్న విషయం శ్రీకాంత్ కి తెలిసింది. ఆమె అంగీకరించిన తర్వాత శ్రీకాంత్ నేను చేయను అని అన్నారు. మొదట నాతోనే కదా ఆమె చేయను అని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు నేనెందుకు చేయాలి, నేను చేయను అని అన్నారు. శ్రీకాంత్ వాదన నాకు లాజికల్ గానే అనిపించింది. దీనితో ఆ డ్యాన్స్ మూమెంట్ ని ఛేంజ్ చేశాం. కానీ ఆ స్టెప్పుని మరో సాంగ్ లో ప్రభుదేవాతో నమిత చేసింది అని నాగేశ్వర రెడ్డి అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories