Nabha Natesh Photos: ఉగాది కానుక అందించిన ఇస్మార్ట్ బ్యూటీ.. సంప్రదాయ దుస్తుల్లో అట్రాక్ట్ చేస్తున్న నభా నటేష్

Published : Apr 02, 2022, 10:43 AM ISTUpdated : Apr 02, 2022, 11:53 AM IST

హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh) ఉగాది పర్వదినాన అచ్చు తెలుగమ్మాయిలా రెడీ అయ్యింది. సంప్రదాయ దుస్తులు ధరించి  తన అభిమానులకు తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.

PREV
16
Nabha Natesh Photos: ఉగాది కానుక అందించిన ఇస్మార్ట్ బ్యూటీ.. సంప్రదాయ దుస్తుల్లో అట్రాక్ట్ చేస్తున్న నభా నటేష్

తెలుగు ప్రజలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన పండుగ ‘ఉగాది’ (Ugadi 2022). తెలుగు నూతన సంవత్సరాన్ని ఉగాదితోనే ప్రారంభించుకొని, సకల దేవతలను ప్రార్థిస్తారు. షడ్రుచుల ఉగాది పచ్చడిని దైవ ప్రసాదంగా తీసుకుంటారు.
 

26

ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ కు చెందిన నటీనటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని సంప్రదాయ దుస్తులు ధరించి, తెలుగు ప్రజలతో పాటు, అందరికీ తమ జీవితంలో శుభపరిణామాలు జరగాలని కోరుకుంటున్నారు. 
 

36

హీరోయిన్ నభా నటేశ్ తన అభిమానులతో పాటు, తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది పర్వదినాన  శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో అచ్చమైన తెలుగమ్మాయిలా రెడీ అయ్యింది. ఈ మేరకు పలు ఫొటోలను ఇన్ స్టాలో అభిమానులతో పంచుకుంది.
 

46

ఈ ఫొటోల్లో నభా రెడ్ లెహంగా, వోణీని ధరించి అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగమ్మాయిలా అందాలను ఆరబోసింది కర్నాటక బ్యూటీ. ఆకట్టుకునే ఫోజులతో నభా తెలుగు వారికి మరింత దగ్గరైంది. నభా ట్రెడిషినల్ వేర్ లో మైమరిపిస్తోంది.
 

56

ఈ ఫొటోలను  షేర్ చేసుకుంటూ ‘ప్రతి ఒక్కరికీ ఉగాది శుభాకాంక్షలు.. ఈ నూతన సంవత్సరంలోకి ప్రేమ, ఆనందం, సానుకూలతను స్వాగతిద్దాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ మేరకు నభా నటేశ్ కు కూడా అభిమానులు, తెలుగు ప్రేక్షకులు, నెటిజన్లు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 

66

నభా ‘నన్ను దోచుకుందువటే’ తెలుగు చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో తెలుగు ఆడియెన్స్ కు చాలా దగ్గరైంది. డిస్కో రాజా, సోలో బ్రతుకే సోబెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతానికి తెలుగులోనే వరుస సనిమాలు చేస్తోందీ కన్నడ హీరోయిన్.  
 

click me!

Recommended Stories