పొట్టి డ్రెస్ లో నభా నటేష్ ఖతర్నాక్ పోజులు.. జీరో సైజు నడుముతో ఇస్మార్ట్ బ్యూటీ రచ్చ..

First Published | May 8, 2023, 6:53 PM IST

‘ఇస్మార్ట్ శంకర్’ హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) వరుస  ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. కుర్రాళ్ల మతులు పోట్టేలా అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తోంది. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.  
 

కన్నడ భామ నభా నటేష్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. తన కేరీర్ 2015 నుంచి ప్రారంభించింది. తెలుగులోకి మాత్రం ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత ‘అదుగో’ చిత్రంలోనూ నటించింది. ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.  
 

కానీ పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తో భారీ హిట్ ను సొంతం చేసుకుంది. అచ్చమైన తెలంగాణ అమ్మాయిలా తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. అలాగే డాన్స్ తో, అందంతోనూ కట్టిపడేసింది. యూత్ లో భారీ క్రేజ్ ను దక్కించుకుంది. 
 


ఆ తర్వాత వరుసగా నాలుగు చిత్రాల్లో నటించి మాయమైంది. పెద్దగా హిట్లు లేకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు కూడా రావడం లేదని తెలుస్తోంది. రెండేండ్లు ఈ ముద్దుగుమ్మ నుంచి ఎలాంటి సినిమా ప్రకటన లేదు. మళ్లీ ఏ చిత్రంతో వస్తుందా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.  

ఇదిలా ఉంటే నభా మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం  రేపుతోంది.  గ్లామర్ మెరుపులతోనూ నెటిజన్లను ఊపిరాడకుండా చేస్తోంది. లేటెస్ట్ గా పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

పొట్టి డ్రెస్ లో అవుట్ డోర్ ఫొటోషూట్ తో నభా ఆకట్టుకుంది. థైస్ అందాలు, టాప్ గ్లామర్ మెరుపులతో మతులు పోగొట్టింది. జీరో సైజ్ నడుముతో, కత్తిలాంటి ఫోజులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తెక్కించే చూపులతో నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేసింది. కవ్వింపు చర్యలతో మతులు పోగొట్టింది.

ప్రస్తుతం ఈ ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అయ్యారు. చివరిగా ‘అల్లుడు అదుర్స్’, ‘మ్యాస్ట్రో’ వంటి చిత్రాలతో అలరించింది. పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం మరిన్ని అవకాశాలను దక్కించుకునేందుకు ఇలా నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. గ్లామర్ మెరుపులతో దర్శక నిర్మాతల కంట్లో పడేలా ప్రయత్నిస్తోంది.

Latest Videos

click me!