టాప్ లేచిపోయేలా మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో.. బ్లాక్ అవుట్ ఫిట్ లో కిల్లింగ్ స్టిల్స్.. పిక్స్

First Published | Jul 19, 2023, 9:58 PM IST

బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తొలిసినిమాతోనే తన నటనతో మెప్పించి వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. మరోవైపు స్టన్నింగ్ ఫొటోషూట్లతోనూ నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. 
 

మరాఠి భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  బాలీవుడ్ హీరోయిన్ గా కాస్తా మంచి గుర్తింపే దక్కించింది. నటిగా బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ కట్టిపడేసింది. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తూనే ఇటు దక్షిణాది సినిమాలపైనా ఫోకస్ పెట్టింది. 
 

‘సీతారామం’తో మృణాల్ తొలుత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఫస్ట్ సినిమాతోనే మంచి క్రేజ్ దక్కించుకుంది. సీత పాత్రలో ఓదిగిపోయింది. అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. మరోవైపు అందంలోనూ మంచి మార్కులు సాధించింది. 
 


ఫలితంగా ప్రస్తుతం టాలీవుడ్ లో మృణాల్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ‘సీతారామం’ తర్వాత వెంటనే Nani30లో ఫైనల్ అయ్యింది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కీలక షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకున్నట్టు మృణాల్ నే స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
 

ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన కూడా వెండితెరపై అలరించబోతోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ - మృణాల్ జంటగా క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. VD13 వర్క్ టైటిల్ తో షూటింగ్ షూరూ అయ్యింది. 
 

మరోవైపు కోలీవుడ్ పైనా మృణాల్ కన్ను పడింది. ఇప్పటికే తమిళ స్టార్ కార్తీకేయ సరసన ఓ మూవీలో ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో మృణాల్ దుమ్ములేపుతోంది. ఈమె స్పీడ్ చూస్తుంటే కొన్నాళ్లు సౌత్ లో వెలుగొందడం ఖాయమంటున్నారు. 
 

ఇదిలా ఉంటే మృణాల్ వరుస సినిమాలతోనే అలరించడం కాకుండా సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. తన అభిమానులు, ఫాలోవర్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది. వారికికోసం క్రేజీగా పోస్టులు పెడుతోంది. మరోవైపు స్టన్నింగ్ గా ఫొటోషూట్లు కూడా చేస్తోంది.
 

తాజాగా మృణాల్ అదిరిపోయే అవుట్ ఫిట్ లో కిర్రాక్ లుక్ లో మెరిసింది. వెస్ట్రన్ వేర్స్  లో కిల్లింగ్ ఫోజులిస్తూ ఫొటోషూట్ చేసింది. కిర్రాక్ స్టిల్స్ తో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంది. మరోవైపు షోల్డర్స్ లెస్ టాప్ లో అందాల విందు చేసింది. 
 

అప్పుడప్పుడు నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్న మృణాల్ ఇలా స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. ఓవైపు ట్రెడిషనల్ వేర్స్ లో మెరుస్తూనే మరోవైపు గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతోంది. కిర్రాక్ లుక్ లో దర్శనమిస్తూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. 
 

Latest Videos

click me!