ఎర్రచీర, బ్లాక్ బ్లౌజ్ లో ‘జాతిరత్నాలు’ చిట్టి హోయలు.. ఆ మత్తుచూపులకు మైమరిపించిపోవాల్సిందే..

First Published | Jul 19, 2023, 9:16 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)  చీరకట్టులో మెరిసిపోతోంది. సంప్రదాయ దుస్తుల్లో జాతిరత్నాలు హీరోయిన్ మరింత అందంగా మెరిసింది. తాజాగా అభిమానులతో పంచుకున్న ఫొటోస్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. 
 

‘జాతిరత్నాలు’ చిట్టి ఇటీవల స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ట్రెండీ అవుట్ ఫిట్లు ధరిస్తూ కుర్రాళ్లపై అందాల దాడి చేస్తోంది. మతులుపోయే ఫోజులతో కట్టిపడేస్తోంది. బ్యాక్ టు బ్యాక్  ఫొటోషూట్లు చేస్తూ అందంతో చూపుతిప్పుకోనివ్వడం లేదు. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో మెరిసింది. ఈ పొడుగుకాళ్ల సుందరి ట్రెండీ వేర్స్ లోనే అదరగొడుతూనే.. ఇటు ట్రెడిషనల్ వేర్స్ లోనూ అట్రాక్ట్ చేస్తోంది. ఇక ఫరియా చీరకట్టి నెట్టింట దర్శనమిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. బ్యూటీఫుల్ లుక్ తో వారిని మంత్రముగ్ధులను చేస్తోంది. 
 


లేటెస్ట్ పిక్స్ లో ఫరియా శారీలో మెరిసింది. రెడ్ శారీలో స్లీవ్ లెస్ బ్లాక్ బ్లౌజ్ లో బ్యూటీఫుల్ గా దర్శనమిచ్చింది. చీరకట్టుకే అందం తెచ్చేలా కనిపించింది. మరోవైపు మత్తుగా ఫొటోలకు ఫోజులిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. క్యూట్ గా మెరిసి మంత్రముగ్ధులను చేసింది. 

‘చిట్టి’ పాత్రలో నటించిన ఫరియాకు నటిగా మంచి క్రేజ్ దక్కింది. దాంతో వరుసగా తెలుగులో ఆఫర్లు అందుకుంది. ఆ వెంటనే ‘బంగార్రాజు’ సినిమాలో స్పెషల్ అపియరెన్స్ తోనూ ఆకట్టుకుంది. గ్లామర్ స్టెప్పులు వేసి ప్రేక్షకులను కట్టిపడేసింది. వరుస చిత్రాలతో అలరిస్తూ వస్తోంది. ఫ్యాన్స్  ఫిదా అవుతూ లైక్స్, కామెంట్లతో పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

ఇక కేరీర్ విషయానికొస్తే తొలిచిత్రం ‘జాతిరత్నాలు’తో మంచి హిట్ ను అందుకుంది. నవీన్ పొలిశెట్టి సరసన అద్భుతమైన పెర్ఫామ్ చేసి ఆకట్టుకుంది. ‘చిట్టి’ పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. దాంతో ఒక్కసారిగా ఫరియా క్రేజ్ పెరిగింది. వరుస ఆఫర్లనూ సొంతం చేసుకుంది. 

ఇక చివరిగా వచ్చిన రెండు చిత్రాలు ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’, ‘రావణసుర’ చిత్రాలు పెద్దగా అలరించలేకపోయాయి. దీంతో హిట్లకు కాస్తా దూరమైంది. ఫలితంగా తెలుగులో ప్రస్తుతం ఆఫర్లు లేవు. తమిళంలో మాత్రం ‘వల్లి మయిల్’ అనే మూవీలో నటిస్తోంది. మళ్లీ తెలుగులో ఎప్పుడు అవకాశం దక్కించుకుంటుందో చూడాలి. 

Latest Videos

click me!