ట్రెడిషనల్ లుక్ లో యువరాణిలా ‘సీతారామం’ హీరోయిన్.. బ్రైడల్ ఫొటోషూట్ తో కట్టిపడేస్తున్న మృణాల్ ఠాకూర్..

First Published | Feb 9, 2023, 1:49 PM IST

‘సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్  (Mrunal Thakur) ఆకట్టుకునే ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తున్నారు. అట్రాక్టివ్ దుస్తుల్లో మెరుస్తున్నారు. తాజాగా బ్రైడల్ ఫొటోషూట్ తో ఆకట్టుకుంటుంది. 
 

ప్రముఖ బ్యానర్ వైజయంతి మూవీస్ నిర్మించిన ‘సీతారామం’తో మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. బాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందుతున్న ఈ బ్యూటీ ఈ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో తొలిచిత్రంతోనే మంచి క్రేజ్ దక్కించుకున్నారు.
 

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాకూర్ అద్భుతమై నటనను ప్రదర్శించింది. సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ సినీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె గ్లామర్, యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు.. 
 


దీంతో వరుసగా ఆఫర్లు అందుకుంటున్నారు మృణాల్ ఠాకూర్. మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడంతో పాటు ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ కొన్ని బ్యూటీఫుల్ పిక్స్ ను పంచుకుంది.
 

‘బ్రైడల్ ఆసియా’ మ్యాగజైన్ కోసం మృణాల్ తాజాగా ఓ ఫొటోషూట్ చేసింది. ఆ పిక్స్ నే అభిమానులతో షేరు చేసుకుంది. ఈ ఫొటోల్లో మృణాల్ పెళ్లికూతురిలా మెరిసిపోతోంది. అందంతో కట్టిపడేస్తోంది. మరోవైపు యువరాణిలా పోజులిస్తూ హుందాను కనబర్చింది. 
 

మృణాల్ ఠాకూర్ తాజా బ్రైడల్ షూట్‌తో ఆకర్షించే దుస్తుల్లో మెరిశారు. వెల్వెట్, గోటా పట్టీ, ఫనా లెహంగా సెట్‌లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. చండేరీ లెహంగా సెట్‌లో గోల్డెన్ బాడీస్, పర్పుల్ మరియు గోల్డ్ స్కర్ట్, మల్టీ-హ్యూడ్ దుపట్టా, ఆభరణాలు ధరించి ఆకట్టుకుంది. 

‘సీతారామం’ తర్వాత మృణాల్ ఠాకూర్ నటించబోతున్న తెలుగు చిత్రం Nani30. నేచురల్ స్టార్ నాని సరసన ఆడిపాడనుంది. ఇక రీసెంట్ గా హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ డాన్స్ తోనూ అదరగొట్టింది. అక్షయ్ కుమార్ నటిస్తున్న సెల్ఫీ చిత్రంలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. తాజాగా  విడుదలైన సాంగ్ ప్రోమోలో మృణాల్ గ్లామర్ షోకు అందరూ ఫిదా అవుతున్నారు. 
 

Latest Videos

click me!