ప్రభాస్ తో నిశ్చితార్థం... స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ కృతి సనన్ 

Published : Feb 09, 2023, 01:34 PM IST

ఒకప్పుడు అనుష్క శెట్టితో ప్రభాస్ పెళ్లంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఏడాది కాలంగా కృతి సనన్ తో ఎఫైర్ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏకంగా ప్రభాస్-కృతి సనన్ నిశ్చితార్థం అంటూ కథనాలు వెలువడుతున్నాయి.    

PREV
16
ప్రభాస్ తో నిశ్చితార్థం... స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ కృతి సనన్ 


బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు తాజా ట్వీట్ ఈ వార్తలకు ఆజ్యం పోసింది.  సద్దుమణిగిన ఈ వ్యవహారం మరలా తెరపైకి వచ్చింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు త్వరలో ప్రభాస్-కృతి సనన్ ఎంగేజ్మెంట్ అంటూ ట్వీట్ చేశారు. ఆయన కామెంట్ ని బాలీవుడ్ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది. 
 

26

ఈ వార్తలపై కృతి సనన్ స్పందించారు. ఇవన్నీ నిరాధార కథానాలంటూ ఆమె కొట్టిపారేశారు. ప్రభాస్ తో నాకు ఎలాంటి ఎఫైర్ లేదు. అలాగే మేము పెళ్లి చేసుకోవడం లేదు. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమేనని తేల్చిపారేశారు. 
 

36
Prabhas-Kriti Sanon


ప్రభాస్ మీద ఎఫైర్ రూమర్స్ కొత్తేమీ కాదు. పలువురు హీరోయిన్స్ తో ఆయన ఎఫైర్ నడిపారని వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా అనుష్క పేరు వినిపించింది. అనుష్క తో ప్రభాస్ వివాహం ఖాయమే అంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లను ప్రభాస్, అనుష్క ఖండించారు. కొన్నాళ్లుగా కృతి సనన్, ప్రభాస్ ప్రేమించుకుంటున్నారనే వార్తలు బాలీవుడ్  లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

46
Prabhas-Kriti Sanon

కృతి-ప్రభాస్ ఎఫైర్ రూమర్స్ కి వరుణ్ ధావన్ ధావన్ కామెంట్స్ కారణమయ్యాయి. ఆయన హీరోగా నటించిన  బేడియా మూవీ 2022 నవంబర్ 25న విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం కృతి సనన్, వరుణ్ ధావన్ ఒక బాలీవుడ్ షోలో పాల్గొన్నారు. సదరు షోలో యాంకర్ గా కరణ్ జోహార్ ఉన్నారు. కృతిసనన్ పేరు నీ గుండెల్లో ఎందుకు లేదని కరణ్, వరుణ్ ని అడిగారు. ఎందుకంటే... కృతి నేమ్ మరొకరి గుండెల్లో ఉంది. ఆయన ముంబైలో లేడు. మరోచోట దీపికా పదుకొనె తో షూటింగ్ లో చేస్తున్నాడని, వరుణ్ కామెంట్ చేశాడు. 

56

దీంతో ప్రభాస్ పెళ్లి విషయంలో ఏదైనా సంచలన ప్రకటన రానుందా అని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ప్రభాస్ కి పెళ్లి ఈడు ఎప్పుడో దాటిపోయింది. ఆయన ప్రస్తుత వయసు 42 సంవత్సరాలు. 2017 బాహుబలి 2 విడుదల కాగా అప్పటి నుండి తరచుగా పెళ్లి వార్తలు తెరపైకి వస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. అనుష్కతో పెళ్లి వార్తలను ఆయన ఖండించారు. మరి కృతి సనన్ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి..

66


  కాగా ప్రభాస్-కృతి సనన్ జంటగా ఆదిపురుష్ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రామునిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ నటించారు. దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జూన్ 16న ఆదిపురుష్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories