చరణ్ ఫారెన్ వెళ్ళిపోతే ఆ పని చేసేది నేనే.. కోట్ల ఆస్తి, అయినా నాది మిడిల్ క్లాస్ మెంటాలిటీనే

Published : Apr 01, 2024, 01:33 PM ISTUpdated : Apr 01, 2024, 01:37 PM IST

తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవితో పాటు ఈ ఈవెంట్ లో ఫ్యామిలీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. 

PREV
16
చరణ్ ఫారెన్ వెళ్ళిపోతే ఆ పని చేసేది నేనే.. కోట్ల ఆస్తి, అయినా నాది మిడిల్ క్లాస్ మెంటాలిటీనే
Chiranjeevi

తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవితో పాటు ఈ ఈవెంట్ లో ఫ్యామిలీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య కాసేపు సరదా సంభాషణ జరిగింది. విజయ్ దేవరకొండ చిరంజీవిని అనేక ప్రశ్నలు అడిగారు. 

 

26
Chiranjeevi

చిరంజీవి కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఆసక్తికర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, చిరు ఇద్దరూ తమ మిడిల్ క్లాస్ మెంటాలిటీ బయట పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. చిరు సర్.. గత పదేళ్లలో నా లైఫ్ చాలా మారిపోయింది. హీరోగా రాణిస్తున్నాను. కానీ ఇంకా నాలో ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ పోలేదు. 

36

స్నానం చేస్తున్నప్పుడు షాంపూ అయిపోతే బాటిల్ లో నీళ్లు పోసుకుని షేక్ చేసి వాడేస్తా. మీ జీవితం కూడా ఇన్నేళ్ళలో చాలా మారిపోయి ఉంటుంది. కానీ మీలో ఇంకా ఏమైనా మిడిల్ క్లాస్ లక్షణాలు ఉన్నాయా అని అడిగారు. నువ్వు చెప్పిన షాంపూ బాటిల్ విషయానికి నేను చాలా రిలేట్ అయ్యాను అని చిరు విజయ్ ని అభినందించారు. 

46

నాకు కూడా అలాంటి అలవాట్లు ఉన్నాయి. సబ్బు బిళ్ళ బాగా అరిగిపోతే.. అరిగిపోయిన ముక్కలన్నింటిని కలిపి ఒక సోపుగా చేసి వాడుతా. ఇంట్లో వృధాగా ఒక్క లైట్ వెలుగుతున్నా ఒప్పుకోను. చరణ్ ఎప్పుడైనా ఫారెన్ వెళితే అతడి ఫ్లోర్ లో కనీసం ఇద్దరు లైట్స్ ఆపకుండా వెళ్ళిపోతాడు. 

56

కొన్నిసార్లు ఇంట్లో గ్లీజర్ కూడా ఆపరు. వాటన్నింటి కోసం నా ఫోన్ లో ఒక యాప్ ఉంది. అన్ని చెక్ చేసి నేనే ఆపుతాను. ఇదంతా ఫన్నీగా అనిపించొచ్చు. బెంగుళూరులో ఇటీవల ఇల్లు కట్టాం. అక్కడ విపరీతమైన నీటి ఎద్దడి ఉంది. దీనితో నేనే స్వయంగా ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయించా. ఇలా జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించినా పొదుపు అనేది అవసరం అని చిరంజీవి అన్నారు. 

66

చిరంజీవి ఇండస్ట్రీలోకి సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. మెట్టు మెట్టు ఎదుగుతూ తెలుగు చిత్ర పరిశ్రమ శిఖరాగ్రానికి చేరుకున్నారు. చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకోమని తన తండ్రి తరచుగా చెబుతుంటారు అని విజయ్ దేవరకొండ అన్నారు. 

click me!

Recommended Stories