Meena: ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా.. ఆమె స్థాయి మాత్రం వేరు.! ఎవరూ టచ్ చేయలేరు..

Published : Apr 14, 2026, 07:00 AM IST

Meena: నటి మీనా తన సినీ ప్రయాణంలో ఎదురైన ఆసక్తికర అనుభవాలను పంచుకున్నారు. రోజాతో ఉన్న టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్, సౌందర్యతో ఉన్న స్నేహం, గ్లామర్ పాత్రల కోసం ఒకప్పుడు తాను పడ్డ ఆరాటం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

PREV
15
హీరోయిన్ల మధ్య పోటీ

తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన మీనా, తన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. గ్లామర్ పాత్రల కంటే అభినయానికి పెద్దపీట వేసిన మీనా, ఒకప్పుడు తను కూడా గ్లామర్ పాత్రలు చేయాలని ఎందుకు అనుకున్నారో, అప్పట్లో హీరోయిన్ల మధ్య పోటీ ఎలా ఉండేదో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

25
గ్లామర్ పాత్రలపై మీనా ఆవేదన

కెరీర్ ప్రారంభంలో ఇతర హీరోయిన్లు గ్లామర్ పాత్రలు చేస్తూ విపరీతమైన అటెన్షన్, ఇంపార్టెన్స్ పొందుతుంటే తను కూడా గ్లామర్ రోల్స్ చేయాలని అనుకున్నట్లు మీనా తెలిపారు. "నేను కూడా అందరిలా గ్లామర్ రోల్స్ చేస్తే నాకు కూడా అంతే ప్రాధాన్యత దొరుకుతుందేమో అని ఒకప్పుడు అమ్మ దగ్గర ఏడ్చేదాన్ని" అని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే, కాలక్రమేణా ఆడియన్స్ తనను గౌరవిస్తూ గుండెల్లో పెట్టుకోవడం చూసిన తర్వాతే తన క్యారెక్టర్లే తనకు గుర్తింపు తెచ్చాయని అర్థం చేసుకున్నట్లు వెల్లడించారు.

35
రోజాతో టగ్ ఆఫ్ వార్.. సౌందర్యతో స్నేహం

అప్పట్లో కథానాయికల మధ్య ఉన్న పోటీ గురించి మాట్లాడుతూ.. తనకు రోజాకు మధ్య విపరీతమైన కాంపిటీషన్ ఉండేదని మీనా తెలిపారు. ఒకవేళ తను డేట్స్ కుదరక ఏదైనా సినిమా వదులుకుంటే అది రోజా చేసేదని, రోజా చేయని సినిమాలు తన దగ్గరకు వచ్చేదని ఆమె వివరించారు. సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, నగ్మా లాంటి వారందరూ తన సమానంగా పోటీ ఇచ్చినప్పటికీ, వారందరితో స్నేహం కొనసాగుతోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 90ల నాటి హీరోయిన్లందరూ ఇప్పటికీ పండుగలు, వేడుకల సమయంలో కలుస్తూ ఒక గ్రూపులా సెలబ్రేట్ చేసుకుంటామని ఆమె పేర్కొన్నారు.

45
షూటింగ్ సెట్స్‌లో 'ముఠామేస్త్రి' పోటీ

చిరంజీవితో నటించిన 'ముఠామేస్త్రి' సినిమా సమయంలో రోజాతో ఉన్న కాంపిటీషన్ గురించి మీనా ఆసక్తికర విషయాలు చెప్పారు. "కెమెరా ముందు ఎవరు బెస్ట్ గా కనిపిస్తారు, ఎవరు ఫస్ట్ షూటింగ్ కు వస్తారు, ఎవరు డైలాగ్స్ బాగా చెప్తారు అనే విషయంలో మా మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉండేది" అని ఆమె వివరించారు. అయితే ప్యాకప్ చెప్పగానే అందరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవారమని తెలిపారు.

55
గ్లామర్ ప్రయోగాలు.. అన్ కంఫర్టబుల్ ఫీల్

ప్రభుదేవా సినిమాలో స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేసుకున్న అనుభవాన్ని మీనా గుర్తు చేసుకున్నారు. అందరూ చేస్తున్నారు కదా అని తాను కూడా ఒకసారి ప్రయత్నించానని, కానీ ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత మేకప్ రూమ్ నుంచి బయటకు రావడానికి కూడా చాలా అన్ కంఫర్టబుల్ గా ఫీలయ్యానని వెల్లడించారు. ఆ సినిమా చూసిన ఆడియన్స్ కూడా "మీరు ఎందుకు ఇలాంటి పాత్ర చేశారు?" అని ప్రశ్నించారని, అప్పుడే గ్లామర్ పాత్రలు తనకు సెట్ కావని వదిలేశానని మీనా స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories