
`ధురంధర్` సినిమాలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు దర్శకుడు ఆదిత్య ధర్. బాలీవుడ్‌లో ఫేమస్ అయిన ఈ దర్శకుడు `ధురంధర్` చిత్రాలతో ఇప్పుడు ఇండియా వైడ్‌గా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. ఆదిత్య ధర్.. హీరోయిన్ యామీ గౌతమ్ భర్త. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆదిత్య ధర్ అంతకు ముందు `ఊరి` అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ సమయంలోనే ఈ దర్శకుడి గురించి చర్చ స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు `ధురంధర్` చిత్రాలతో బాగా వినిపిస్తోంది. ఆయన రూపొందించిన `ధురంధర్` మొదటి భాగం ఏకంగా రూ.1300కోట్లకుపైగా కలెక్షన్లని సాధిస్తే, ఇప్పుడు `ధురంధర్ 2` ఇప్పటి వరకు రూ.1700కోట్లు దాటింది. `పుష్ప 2` వసూళ్లని దాటేయడానికి రెడీ అవుతుంది.
ఈ నేపథ్యంలో `ధురంధర్ 2` దర్శకుడు నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రకరకాల పేర్లు వినిపించాయి. మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. కానీ లేటెస్ట్ గా మరో అదిరిపోయే వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఆ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ నటుడా? టాలీవుడ్ నటుడా? కోలీవుడ్ నటుడా అనేది క్లారిటీ లేదు. అయితే తెలుస్తోన్న సమాచారం ప్రకారం ఆ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ టాలీవుడ్ హీరో అని తెలుస్తోంది.
ఇండియా బిగ్గెస్ట్ స్టార్‌గా ప్రభాస్‌ని పిలుస్తుంటారు. ఇమేజ్, మార్కెట్ పరంగా ఆయనే చాలా రోజులుగా బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారు. చాలా మీడియా మాధ్యమాలు, ఇండస్ట్రీ కూడా అదే భావిస్తోంది. దీంతో ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ నెక్ట్స్ మూవీ ప్రభాస్‌తోనే అనేది కన్ఫమ్ అవుతుంది. అయితే ఈ వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. కాకపోతే అది మల్టీస్టారర్ రూపంలో వినిపిస్తోంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ సమాచారం మేరకు ప్రభాస్‌తో ఆదిత్య ధర్ మూవీ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇటీవల ప్రభాస్, సందీప్‌రెడ్డి వంగా.. `ధురంధర్ 2` సినిమాని ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా వారుపోస్ట్ లు కూడా పెట్టారు. దీనికి ఆదిత్య ధర్ స్పందించి ఆనందం వ్యక్తం చేశారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో `స్పిరిట్` మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రభాస్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇదే ఇప్పుడు వీరి కాంబో సెట్ అయ్యిందనే వార్తలకు బలం చేకూరుతోంది. ఆదిత్య ధర్.. నెక్ట్స్ ప్రభాస్‌తోనేనా, లేదంటే బాలీవుడ్‌లో మరో పెద్ద హీరో(షారూఖ్ ఖాన్)తో ఉంటుందా అనది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇక ప్రభాస్ విషయానికి వస్తే, ఆయన భారీ లైనప్‌తో ఉన్నారు. ప్రస్తుతం ఆయన `ఫౌజీ`, `స్పిరిట్` చిత్రాల్లో నటిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` మూవీ రూపొందుతుంది. ఇమానీ ఇందులో హీరోయిన్. పీరియడ్ వార్, లవ్ స్టోరీగా ఈ మూవీ రూపొందుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని సమాచారం. ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. దీంతోపాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` మూవీ రూపొందుతుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. ఆ తర్వాత `కల్కి 2` రూపొందే అవకాశం ఉంది. ఆ తర్వాత `సలార్ 2` ఉంది. ఇప్పుడు ఆదిత్య ధర్‌తో సినిమా సెట్ అయితే నెక్ట్స్ ఈ మూవీనే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
ఆదిత్య ధర్ నెక్ట్స్ మూవీ ప్రభాస్‌తోనే అయితే ఈ కాంబినేషన్ ఊహించుకోవడానికి పూనకాలు వస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వీరమాస్ దర్శకుడిగా, అంతకు మించిన ఊరమాస్ హీరో, అందులోనే బిగ్గెస్ట్ కటౌట్ ఉన్న హీరో, బిగ్గెస్ట్ సూపర్ స్టార్ పడితే ఆ సినిమా వేరేలెవల్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇండియాలో అత్యంత అంచనాలున్న మూవీ `వారణాసి`. ఇది అన్ని రికార్డులు బ్రేక్ చేయబోతుందనే భావన ఉంది. అయితే ప్రభాస్‌తో ఆదిత్య ధర్ సినిమా చేస్తే ఇది దాన్ని మించి ఉండబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.