ఇదో చెత్త యాంగిల్.. ట్రోలర్స్ కి స్వయంగా మెటీరియల్ ఇస్తున్న మంచు లక్ష్మి!

Published : May 16, 2023, 11:56 AM ISTUpdated : May 16, 2023, 11:58 AM IST

మంచు లక్ష్మి లేటెస్ట్ సెల్ఫీ ట్రోలర్స్ కి చక్కని మెటీరియల్ వలె ఉంది. స్వయంగా ట్రోలర్స్ కి ఛాన్స్ ఇస్తున్నట్లుగా ఆమె తీరుంది. మంచు లక్ష్మి అసహజమైన సెల్ఫీ వైరల్ అవుతుంది.   

PREV
16
ఇదో చెత్త యాంగిల్.. ట్రోలర్స్ కి స్వయంగా మెటీరియల్ ఇస్తున్న మంచు లక్ష్మి!
Manchu Lakshami

మంచు లక్ష్మి ఫిట్నెస్ ఫ్రీక్. వ్యాయామం ఆమె దినచర్యలో భాగంగా ఉంటుంది. రోజు ఉదయాన్నే యోగాసనాలు వేస్తారు. వ్యాయామం, యోగా చేస్తారు. ఇక తన ఎక్సర్సైజ్ వీడియోలు, ఫోటోలు ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో పెడతారు. తనను చూసి మరికొందరు స్ఫూర్తి పొందాలని ఆమె కోరుకుంటారు. 
 

26


తాజాగా ఆమె జిమ్ ఫిట్ ధరించారు. టాప్ యాంగిల్ నుండి ఓ సెల్ఫీ దిగి పోస్ట్ చేశారు. సదరు సెల్ఫీలో మంచు లక్ష్మి లుక్ ఏం బాగోలేదు. ఆ విషయాన్ని ఆమె స్వయంగా ఒప్పుకున్నారు. అసహజమైన నా సెల్ఫీ చూడండి అంటూ కామెంట్ పెట్టారు. మంచు లక్ష్మి సెల్ఫీ వైరల్ అవుతుంది. 

 

36

సాధారణంగానే  మంచు ఫ్యామిలీని ట్రోల్ చేయడానికి ఒక వర్గం సిద్ధంగా ఉంటుంది. ఇలాంటి ట్రోలింగ్ మెటీరియల్ ఇచ్చి ప్రోత్సహిస్తుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు. మంచు లక్ష్మి ఫోటో వైరల్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు . 

46
Manchu Lakshmi


మంచు లక్ష్మి తాజాగా అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేశారు. మూవీ పూర్తి కాగా విడుదలకు నోచుకోవడం లేదు. అగ్ని నక్షత్రం మూవీలో మంచు లక్ష్మి లీడ్ హీరోయిన్ రోల్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఇరగదీశారు. ఈ చిత్ర విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. 

56
Manchu Lakshmi


ఇటీవల మంచు ఫ్యామిలీలో శుభకార్యం చోటు చేసుకుంది. మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్నారు. భూమిక మౌనిక మెడలో ఆయన మూడుముళ్లు వేశారు. ఈ పెళ్ళికి మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా వ్యవహరించారు. లక్ష్మి నివాసంలో మూడు రోజులు వివాహం జరిగింది. మోహన్ బాబు పెళ్ళికి చివరి నిమిషంలో హాజరయ్యారు. 

66
Manchu Lakshmi

మంచు మనోజ్ పెళ్లి నిర్ణయం కుటుంబంలో గొడవలకు కారణమైందనే వాదన ఉంది. ముఖ్యంగా మంచు బ్రదర్స్ విడిపోయారట. ఈ వాదనలను బలపరుస్తూ మంచు మనోజ్ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విష్ణు తన వాళ్ళను కొడుతూ గొడవలకు దిగుతున్నాడని మనోజ్ ఆ వీడియోలో ఆరోపించారు.

click me!

Recommended Stories