Mamta Mohandas: ఎంగేజ్‌మెంట్ అయిన హీరోతో డేటింగ్.. పచ్చి మోసాన్ని బయటపెట్టిన నాగార్జున హీరోయిన్‌

Published : Feb 14, 2026, 10:58 PM IST

Mamta Mohandas: తెలుగులో ఎన్టీఆర్‌, నాగార్జునలతో కలిసి నటించి రచ్చ చేసిన మమతా మోహన్‌ దాస్‌ చాలా రోజుల తర్వాత ఓపెన్‌ అయ్యింది. ప్రేమలో తాను మోసపోయిన విషయాన్ని బయటపెట్టింది.  

PREV
15
ప్రేమలో మోసాన్ని బయటపెట్టిన మమతా మోహన్‌ దాస్‌

సినిమా గ్లామర్ ప్రపంచం వెనుక ఎన్నో బాధలు దాగి ఉంటాయి. నటీనటుల వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్లు, స్ట్రగుల్స్ తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. తెలుగులో ఒకప్పుడు నటించి మెప్పించిన మమతా మోహన్‌ దాస్‌ పలు షాకింగ్‌ విషయాలను పంచుకుంది. ప్రేమికుల రోజు స్పెషల్‌గా తాను ప్రేమలో మోసపోయిన విషయాన్ని వెల్లడించింది. క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన ఆమె దాన్నుంచి కోలుకున్నాక ప్రేమలో పడిందట. కానీ మోసపోవాల్సి వచ్చిందని తెలిపింది. 

25
మమతా మోహన్‌దాస్‌ క్యాన్సర్ తర్వాత మొదలైన కొత్త జీవితం

'మయూఖం' చిత్రంతో వెండితెరకు పరిచయమైన మమతా మోహన్‌దాస్,  తెలుగులోకి `యమదొంగ` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ `కింగ్‌`, `కేడి`, `హోమం`, `విక్టరీ`, `చింతకాయల రవి` వంటి చిత్రాల్లో నటించింది.. కెరీర్‌లో పీక్స్‌లో ఉన్నప్పుడే, అంటే 24 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ బారినపడింది. చావుబతుకుల మధ్య పోరాడి గెలిచిన మమత, కోలుకున్న తర్వాత తన జీవితంలో ఒక తోడు కావాలని కోరుకున్నారు. ఓ నటుడితో డేటింగ్‌ చేసిందట. కానీ అది తనకు పెద్ద షాకిచ్చిందని, మోసానికి గురయినట్టు తెలిపింది మమతా మోహన్‌దాస్‌.  

35
ఎంగేజ్‌మెంట్ దాచిపెట్టి డేటింగ్ చేసిన నటుడు

ఇటీవల 'జోస్ ఆలుక్కాస్ పాడ్‌కాస్ట్'లో మమత మాట్లాడారు. 'క్యాన్సర్ నుంచి కోలుకున్నాక, నేను సినీ పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తితో డేటింగ్ చేశాను. ఇండస్ట్రీలో నేను డేట్ చేసింది అతనితో మాత్రమే. అతను నన్ను డేటింగ్‌కు పిలిచినప్పుడు చాలా సంతోషించాను. మా అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుని మొదటిసారి ఒక అబ్బాయితో డేట్‌కు వెళ్లాను. కానీ, ఆ తర్వాత తెలిసింది, ఆ నటుడికి అప్పటికే ఎంగేజ్‌మెంట్ అయిందని! ఈ విషయం నాకు అతని సోదరుడి ద్వారా తెలిసింది` అని ఆవేదన వ్యక్తం చేసింది మమతా మోహన్‌ దాస్‌

45
మమతా మోహన్‌ దాస్‌ హార్ట్ బ్రేక్‌ అయిన క్షణం

'ఈ నిజం తెలిశాక నా గుండె పగిలిపోయింది. నీకు అప్పటికే పెళ్లి నిశ్చయమైతే నన్ను డేట్‌కు ఎందుకు పిలిచావు? అని అతడిని నిలదీశాను. సమాజంలో పెద్ద పేరున్న వ్యక్తులు ఇలా చేస్తారని నేను ఊహించలేదు'  అని చెప్పింది. ఆ తర్వాత మరో వ్యక్తిని కలిసినా, అతని ప్రవర్తన కారణంగా ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదని తెలిపింది.

55
మమతా మోహన్‌ దాస్‌ కాలేజీ రోజుల్లో విషాదం

తన పాత రోజులను గుర్తుచేసుకున్న మమత, కాలేజీ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఒకరితో డేట్ చేశానని చెప్పారు. కానీ, అతను అకాల మరణం చెందడం తనకు పెద్ద షాక్ ఇచ్చిందని తెలిపారు. మొత్తంగా, క్యాన్సర్ అనే వ్యాధిని ధైర్యంగా ఎదుర్కొని గెలిచిన మమతా మోహన్‌దాస్, ప్రేమ, నమ్మకం విషయంలో వరుసగా ఎదురుదెబ్బలు తిన్నారు. ఆమె తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ 'అజ్ఞాత' నటుడు ఎవరనే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories