సైడ్ యాంగిల్లో మాళవిక శర్శ కిర్రాక్ ఫోజులు.. రవితేజ హీరోయిన్ ఎంత ప్రయత్నించిన ఫలితం లేదుగా.!

First Published | Jul 20, 2023, 4:44 PM IST

‘నేల టిక్కెట్’ హీరోయిన్ మాళవికా శర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ అందాల విందు చేస్తోంది. తాజాగా ట్రెండీ వేర్ లో అట్రాక్ట్ చేసింది. 
 

నార్త్ బ్యూటీ, యంగ్ హీరోయిన్ మాళవిక శర్మ (Malvika Sharma)  తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయం అయ్యింది.  టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. కానీ పెద్దగా సక్సెస్ రుచి చూడకపోవడంతో ఈ ముద్దుగుమ్మ కెరీర్ లో జోష్ కనిపించడం లేదు. 
 

మాస్ మహారాజా రవితేజ (RaviTeja)కు జోడిగా ’నేల టిక్కెట్‘ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకుంది. ఈ మూవీలో మాళవికా శర్మ అచ్చం తెలుగమ్మాయిలాగే మెరిసింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది.  కానీ సినిమా ఫలితం ఆమె ఎంట్రీకి మంచి రిజల్ట్ ను అందించలేకపోయింది.
 


ఆ తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేని సరసన ‘రెడ్’ చిత్రంలో మెరిసింది. మహిమ పాత్రలో తనదైన శైలిలో పెర్ఫామ్ చేసి ఆకట్టుకుంది. కానీ రెండో సినిమా కూడా దెబ్బతీసింది. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ దర్శక నిర్మాతలను అట్రాక్ట్ చేయలేకపోయింది. 
 

దీంతో తమిళంలోకి ‘కాఫీ విత్ కాదల్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం గతేడాది విడుదలైంది. ఇలా తన కెరీర్ మొత్తంలో మూడు సినిమాలే చేసింది. అన్నీ అంతంత మాత్రనే ఆడటంతో మాళవిక శర్మకు పెద్దగా ఆఫర్లు అందడం లేదని తెలుస్తోంది. 
 

ఇదిలా ఉంటే.. అవకాశాల కోసం తన ప్రయత్నాలను మాత్రం వదులుకోవడం లేదు. అందుకు సోషల్ మీడియాను ఆయుధంగా మలుచుకుంది. ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గానే ఉంటూ.. వరుసగా పోస్టులు పెడుతూ నెటిజన్లు, ఫ్యాన్స్, ఫాలోవర్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. 
 

తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. సైడ్ యాంగిల్లో ఫొటోలకు ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేసింది. షోల్డర్ గ్లామర్ తో మైమరిపించింది. బ్యూటీఫుల్ స్మైల్, మత్తు చూపుతో కలవరపెట్టింది. అయితే.. ఇలా ఎప్పుడూ నెట్టింట సందడి చేస్తున్నా.. దర్శక నిర్మాతలను మాత్రం అట్రాక్ట్ చేయలేకపోతోంది. మున్ముందైనా మాళవికకు మంచి అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 
 

Latest Videos

click me!