ఆపిల్‌ బ్యూటీ ఇంత స్లిమ్‌గా మారిందేంటి.. బ్లాక్‌ ఫిట్‌లో హన్సికని ఇలా చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Published : Jul 08, 2023, 03:39 PM ISTUpdated : Jul 08, 2023, 06:52 PM IST

ఆపిల్‌ బ్యూటీ హన్సిక.. గ్లామర్‌ సైడ్‌ రోజు రోజుకి మరింతగా ఓపెన్ అవుతుంది. ఆమె నయా అందాలతో కనువిందు చేస్తుంది. పెళ్లి తర్వాత హన్సిక మరింత జోరు పెంచుతుంది. అటు సినిమాల పరంగా, ఇటు అందంతోనూ రచ్చ చేస్తుంది.

PREV
16
ఆపిల్‌ బ్యూటీ ఇంత స్లిమ్‌గా మారిందేంటి.. బ్లాక్‌ ఫిట్‌లో హన్సికని ఇలా చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

హన్సికా మోత్వాని తాజాగా బ్లాక్‌ టైట్‌ ఫిట్‌లో మెరిసింది. ఆమె జాకెట్‌ లేకుండానే ఫోటోలకు పోజులిచ్చింది. ఇందులో హన్సిక చాలా స్టిమ్‌గా ఉంది. బొద్దుగా ఉండే హన్సిక ఇంత స్లిమ్‌గా కనిపించడం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. ఇది హన్సికనేనా అనే అశ్చర్యాన్ని కలిగిస్తుంది. 
 

26

ఆపిల్‌ బ్యూటీగా పాపులర్‌ అయిన హన్సిక ఈ నయా ఫోటోల్లో సూపర్‌ హాట్‌గా ఉంది. ఆమె టైట్‌ ఫిట్‌లో షేపులు చూపిస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. అంతేకాదు, స్టయిలీష్‌ గ్లాసెస్‌ ధరించి హోయలు పోయింది. సైడ్‌ యాంగిల్‌లో హన్సికని ఇలా చూస్తే ఎవ్వరికైనా మెంటల్‌ ఎక్కిపోవాల్సిందే. 
 

36

ఓ ఐ గ్లాసెస్‌ కి సంబంధించిన ప్రమోషనల్‌ యాడ్‌లో భాగంగా హన్సిక ఇలా అందాల విందు చేసింది. అయితే ఇందులో ఆ గ్లాసెస్‌ కంటే ఆమె గ్లామర్‌ షోనే హైలైట్‌గా మారిపోవడం విశేషం. దీంతో ఈ బ్యూటీని ఇలా చూసి నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. వీకెండ్‌ ట్రీట్‌ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. స్లిమ్‌ లుక్‌పై పోస్ట్ లు పెడుతూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. 
 

46

హన్సిక పెళ్లి తర్వాత మరింతగా జోరు పెంచింది. అది సినిమాల పరంగానూ, మరోవైపు గ్లామర్‌ పరంగానూ. హడ్డేలేదనేట్టుగా ఆమె హాట్‌ షో చేయడం విశేషం. సినిమాల పరంగానూ వేగం పెంచింది. వరుసగా మూవీస్‌ చేస్తుంది. త్వరలో ఆమె `పార్టనర్‌` సినిమాతో రాబోతుంది. ఇటీవల ట్రైలర్‌ ని రిలీజ్‌ చేశారు. దానికి మంచి స్పందన లభించింది. ఇందులో ఆదిపినిశెట్టి హీరోగా నటిస్తుండటం విశేషం.
 

56

దీంతోపాటు తెలుగులో `105 మినిట్స్`, `మై నేమ్‌ ఈజ్‌ శృతి` చిత్రాలు చేస్తుంది. ఇవి విడుదల కావాల్సి ఉంది. ఇక తమిళంలో `రౌడీ బేబీ`, `గార్డియన్`, `గాంధారి`, `మ్యాన్‌` సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఒకప్పుడు గ్లామర్‌ హీరయిన్‌గా మెరిసిన హన్సిక ఇప్పుడు బలమైన పాత్రలతోనే వస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు సైతం చేస్తుంది. బలమైన కంటెంట్‌ ఉన్న చిత్రానికి ప్రయారిటీ ఇస్తుంది. 
 

66

ఇదిలా ఉంటే హన్సిక  బాలీవుడ్‌లో తనకు ఎదురైన అవమానాలను ఇటీవల బయటపెట్టిన విషయం తెలిసిందే. అక్కడి డిజైనర్స్ ఆమెను తక్కువగా చేసేవారట. సౌత్ హీరోయిన్స్ అంటే వారికి చులకన భావన ఉండేదట. మీకు మేము దుస్తులు ఇవ్వమని ముఖాన చెప్పేవారట. ఇప్పుడు పరిస్థితి మారిందట. వారే తమ డిజైన్ చేసిన బట్టలు ధరించాలని బ్రతిమిలాడుతున్నారట. ఒకప్పుడు ఛీ కొట్టినవాళ్లు వచ్చి వేడుకుంటుంటే ఆ ఫీలింగ్ బాగుందని హన్సిక అన్నారు. 2022లో హన్సిక బిజినెస్ మాన్ సోహైల్ కతూరియాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అటు ఫ్యామిలీ లైఫ్‌ని, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తుంది హన్సిక. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories