గ్లోబల్ బ్యూటీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తనకంటే చిన్నవాడైన పాప్ సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2018లోనే పెళ్లి చేసుకున్న ఈ జంట గతేడాది తల్లిదండ్రులుగా ప్రమోషన్ కూడా పొందారు. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.
అయితే, స్టార్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా తన కూతురు మాల్టీ మేరీ చోప్రా జోనాస్ (Malti Marie Chopra Jonas)కు సరోగసీ ద్వారా జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో కొన్ని విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.
అయితే దీనిపై తాజాగా ప్రియాంక స్పందించారని వార్తలు వస్తున్నాయి.రీసెంట్ గా బ్రిటిష్ వోగ్ అనే ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా ఎట్టకేలకు తన కూతురు మాల్తీ మేరీ బర్త్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారని తెలుస్తోంది. ఎందుకు సరోగసీ ద్వారా జన్మనివ్వాల్సి వచ్చిందో కూడా వివరించింది.
ఆ కథనం ప్రకారం.. ప్రియాంక మాట్లాడుతూ.. మాల్తీ జన్మించినప్పుడు నేను ఆపరేషన్ థియేటర్ లోనే ఉన్నాను. తను నా చెయ్యి కంటే చాలా చిన్నగా వుంది. తన ఆరోగ్యం రీత్యా కొన్ని రోజులు ఇంటెన్సివ్ కేర్ విభాగంలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాల్సి వచ్చింది. దీంతో నిక్, నేను ఇంక్యుబేటర్ లోని మా కూతుర్ని చూస్తూ చాలా బాధపడ్డాం.
ఆ పరిస్థితుల్లో మాల్తీ హెల్త్ గురించి ఎంతో మంది డాక్టర్లు, నర్సులను కలిశాం. అసలు మాకు బెబీ దక్కుతుందని అనుకోలేదు. కానీ డాక్టర్లంతా కలిసి దేవుడివలె నా బిడ్డకు ప్రాణం పోశారు... ఇక నాకు ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల సరోగసీ విధానాన్ని ఎంచుకున్నాను.
కానీ దీనిపై చాలా మంది.. చాలా రకాలు మాట్లాడారు. నేనేదో అందం తగ్గుతుందని సరోగసీని ఎంచుకున్నట్టు ఆరోపణలు చేశారు. అలాంటివి చాలా బాధను కలిగించాయి.’ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రియాంక హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న బిజీగా ఉంటోంది. ప్రస్తుతం రిచర్డ్ మాడెన్‌తో కలిసి రూస్సో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’లో నటిస్తోంది. మరోచిత్రం ‘లవ్ ఎగైన్’లోనూ నటిస్తోంది.