జీరో సైజ్ నడుముతో.. బ్రా లాంటి టాప్ లో మాళవికా మోహనన్ గ్లామర్ ట్రీట్.. స్టన్నింగ్ పోజులు..

First Published | Apr 18, 2023, 2:06 PM IST

మలయాళీ భామ మాళవికా మోహనన్  (Malavika Mohanan) మరింత ఫిట్ నెస్ గా మారిపోతూ ఆకట్టుకుంటోంది. తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్స్ లో తన జీరో సైజ్ నడుమును చూపిస్తూ అట్రాక్ట్ చేసింది.
 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంటోంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ తన నటనతో మరింతగా క్రేజ్ దక్కిచుకుంటోంది. ఫలితంగా ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. 
 

కేరళకు చెందిన మాళవికా మోహనన్  హీరోయిన్ గా ‘పట్టం పోలె’ మలయాళ చిత్రంతోనే సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత నేరుగా కన్నడ వైపు వెళ్లింది. అటు నుంచి బాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో సినిమాలు చేసింది. తమిళ చిత్రాలతో ఈ బ్యూటీ ఎక్కువగా క్రేజ్ దక్కించుకుంది. 
 


తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సరసన ‘మాస్టర్’ అంతకుముందు ‘పేట’ చిత్రంతో క్రేజ్ దక్కించుకుంది. తమిళంలోని భారీ చిత్రాల్లో ఇప్పుడు అవకాశాలను అందుకుంటుండటం విశేషం. ప్రస్తుతం చియాన్ విక్రమ్ సరసన ‘తంగలన్’ (Thangalaan) మూవీలో నటిస్తోంది. 
 

తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించిన ఈ బ్యూటీకి ఇక టాలీవుడ్ ఒక్కటే టార్గెట్ గా మారింది. ఈ క్రమంలో ఓసారి ఓపెన్ గానే తెలుగు సినిమాలో చేయాలని ఉందంటూ కామెంట్ సైతం చేసింది. ఇప్పటికే ప్రభాస్ -  మారుతీ ప్రాజెక్ట్ లో మాళవికా నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు.

తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ ఇంకా పరిచయం కాలేదు. ప్రస్తుతం డబ్డ్ వెర్షన్ లో సినిమాలు అన్ని లాంగ్వేజీలో వస్తుండటంతో మాళవికకు ‘మాస్టర్’ చిత్రంతో ఆడియెన్స్ లో గుర్తింపు దక్కింది. దీంతో ఈ యంగ్ బ్యూటీ కూడా టాలీవుడ్ కు ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. మాళవికా తన కేరీర్ లో మరిన్ని ఆఫర్లను దక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందుకు స్లిమ్ ఫిట్ అందాలతో నెట్టింట మైమరిపిస్తున్నారు. తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్ లో జీరో సైజ్ నడుమును చూపిస్తూ ఫ్యాన్స్, నెటిజన్లు కట్టిపడేసింది. దాంతో ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం ‘తంగలన్’, ‘యుద్ర’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 
 

Latest Videos

click me!