పింక్‌ డ్రెస్‌లో పూజా హెగ్డే ఎంత క్యూట్‌గా ఉందో.. ఆ నవ్వుకే పడిపోతారేమో.. కానీ టెన్షన్‌ పెడుతున్న సల్మాన్‌..

Published : Apr 18, 2023, 01:24 PM ISTUpdated : Apr 18, 2023, 01:59 PM IST

పూజా హెగ్డే బ్యాక్‌ టూ బ్యాక్‌ అందాల విందు ఇస్తుంది. ఆమె వరుసగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నేపథ్యంలో కలర్‌ఫుల్‌ డ్రెస్సులో అలరిస్తుంది. కానీ ఓ భయం ఆమెని వెంటాడుతుంది.  

PREV
16
పింక్‌ డ్రెస్‌లో పూజా హెగ్డే ఎంత క్యూట్‌గా ఉందో.. ఆ నవ్వుకే పడిపోతారేమో..  కానీ టెన్షన్‌ పెడుతున్న సల్మాన్‌..

బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) ప్రస్తుతం హాట్‌ ఫోటోలతో అలరిస్తుంది. ఆమె బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. హైలైట్‌గా నిలుస్తుంది. తాజాగా పిండ్‌ డ్రెస్‌లో మెరిసింది పూజా. పింక్‌లో ప్లజెంట్‌ లుక్‌లో మెరుస్తుంది. క్యూట్‌నెస్‌లో నింపుకుని మంత్రముగ్దుల్ని చేస్తుంది. 

26

పూజా హెగ్డే ..ప్రస్తుతం హిందీలో `కిసీ కా భాయ్‌ కిసి కి జాన్‌` చిత్రంలో నటిస్తుంది. సల్మాన్‌ ఖాన్‌తో ఆమె మొదటిసారి యాక్ట్ చేసింది. ఇందులో వెంకటేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. పూజాకి అన్న పాత్ర వెంకటేష్ కనిపిస్తారని సమాచారం. మరోవైపు రామ్‌చరణ్‌ ఓ పాటలో మెరవనున్నారు. 

36

అయితే వరుసగా గ్లామర్‌ ట్రీట్‌ తో ఆకట్టుకుంటూ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతున్న పూజాని ఓ విషయం మాత్రం భయపెడుతుంది. సల్మాన్‌ సినిమా విషయంలో ఆమె ఆందోళన చెందుతుంది. ఆ భయం ఇప్పుడు పూజాని వెంటాడుతుంది.
 

46

పూజాహెగ్డే నటించిన సినిమాలు వరుసగా పరాజయం చెందాయి. `రాధేశ్యామ్‌`, `బీస్ట్`, `ఆచార్య`, `సర్కస్‌` మూవీస్‌ పరాజయం చెందాయి. దీంతో గోల్డెన్‌ లెగ్‌ కాస్త ఐరన్‌ లెగ్‌ అనే పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సల్మాన్‌తో చేసిన `కిసి కా భాయ్‌, కిసి కి జాన్‌` చిత్ర సక్సెస్‌ పూజాకి చాలా ఇంపార్టెంట్ గా మారింది. 
 

56

ఈ సినిమా హిట్‌ అయితే ఆమె నెగటివ్‌ ఇమేజ్‌ నుంచి బయటపడి మళ్లీ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అనే పేరుతెచ్చుకుంటుంది. ఆఫర్లు వస్తాయి. అదే సినిమా పరాజయం చెందితే మాత్రం ఆ నెగటివిటీ మరింత పెరుగుతుంది. అది పూజా కెరీర్‌పై చాలా ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఈ బ్యూటీ టెన్షన్‌ పడుతుంది. మరి సల్మాన్‌ నిలబెడతాడా? ముంచుతాడా? అనేది సస్పెన్స్ గా మారింది. ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. 
 

66

పూజా హెగ్డే తెలుగులో మహేష్‌బాబుతో `ఎస్‌ఎస్‌ఎంబీ28` చిత్రంలో నటిస్తుంది. ఇందులో శ్రీలీలా మరో హీరోయిన్‌. దీంతోపాటు పవన్‌, హరీష్‌ చిత్రంలో నటిస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇప్పటికే శ్రీలీలా హీరోయిన్‌గా సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories