ఎర్రటి పెదవులతో మైకం తెప్పిస్తున్న యాపిల్ బ్యూటీ.. పొట్టి డ్రెస్ లో హన్సిక కిర్రాక్ పోజులు..

First Published | Apr 18, 2023, 1:23 PM IST

స్టార్ హీరోయిన్ హన్సిక మెత్వానీ (Hansika Motwani) స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. మత్తెక్కించే అందంతో, మతులు పోగొట్టే పోజులతో రచ్చరచ్చ చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక మెత్వానీ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం. తొలిచిత్రం ‘దేశముదురు’తో భారీ సక్సెస్ ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించింది. బడా హీరోల సరసన నటించి మెప్పించింది. తన అందం, నటనతో ఆకట్టుకుంది. 
 

ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ కేరీర్ పరంగా మరింతగా జోరు పెంచింది. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ముఖ్యంగా పెళ్లి తర్వాత హన్సిక మరింత  యాక్టివ్ గా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో తన అభిమానులకు బాగా దగ్గరగా ఉంటోంది. 
 


ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. మరోవైపు గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతోంది. యాపిల్ బ్యూటీ అందాల ధాటికి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కూడా ఫిదా అవుతున్నారు. ఈక్రమంలో తాజాగా హన్సిక మరిన్ని ఫొటోలను పంచుకుంది. 

గ్రీన్ సూట్ లో పొట్టి నిక్కరు లో స్టైలిష్ గా మెరిసింది. మరోవైపు అందాల విందు కూడా చేసింది. పొట్టి షార్ట్ లో థైస్ అందాలను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. మతులు పోయేలా ఫోజులిస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. మరోవైపు తన రూపసౌందర్యంతోనూ కట్టిపడేసింది.

ముద్దబంతిలాంటి హన్సిక రూపసౌందర్యానికి కుర్రాళ్లు మంత్రముగ్ధులు అవుతుంటే.. తన ఎర్రటి లిప్స్ తో స్టార్ బ్యూటీ మరింతగా అట్రాక్ట్ చేసింది. హన్సిక గ్లామర్ ట్రీట్ కు, మైండ్ బ్లాకింగ్ పోజులకు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్రేజీగా కామెంట్లు చేస్తూ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

కేరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. పెళ్లి తర్వాత కూడా కేరీర్ లో బిజీగా కనిపిస్తోంది. హన్సిక తమిళం, తెలుగులో ఏకంగా ఆరేడు చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ‘105 మినిట్స్’, ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’.. ఇక మిగిలిన చిత్రాలు తమిళంలో రూపుదిద్దుకుంటున్నాయి. 

Latest Videos

click me!