మంచు విష్ణు భారీ బడ్జెట్ లో తన మార్కెట్ కి మించి కన్నప్ప అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని సొంత నిర్మాణంలో నిర్మిస్తున్నారు. ఆల్రెడీ టీజర్ విడుదలయింది. కన్నప్ప శివభక్తుడు అనే సంగతి తెలిసిందే. ఎలాగైనా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించేలా మంచు విష్ణు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు.