డైలాగ్ చెప్పడం రాలేదని.. లైలాను తిట్టిన ప్రముఖ డైరెక్టర్.? కాళ్ల మీద పడ్డానంటూ సీనియర్ నటి కామెంట్స్!

First Published | Sep 2, 2023, 3:49 PM IST

క్యూట్ హీరోయిన్ గా ఒకప్పుడు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటి లయా మళ్లీ వెండితెరపై మెరుస్తోంది. ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. ఇక ఆమెను గతంలో ప్రముఖ డైరెక్టర్ తిట్టినట్టు తాజాగా తెలిపింది. 

90లోనే నటి లైలా (Laila) సినిమాల్లోకి వచ్చింది. క్యూట్ హీరోయిన్ గా, అమాయకంగా వెండితెరపై గుర్తుండిపోయే సినిమాలు చేసి దక్షిణాది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తొలుత హిందీ ఫిల్మ్ ‘దుష్మన్ దునియా కా’ అనే చిత్రంలో కథానాయికగా చేసింది. 
 

తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చాలా సినిమాలు చేసింది. తెలుగులోనూ ‘ఎగిరే పావురమా’, ‘ఖైదీగారు’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘పవిత్ర ప్రేమ’, ‘శుభలేఖలు’, లవ్ స్టోరీ 1999’ వంటి చిత్రాల్లో నటించింది. అలా 2006 వరకు హీరోయిన్ గా అలరించింది.  
 


2006లోనే జనవరి 6 ఇరానీ వ్యాపారవేత్త మెహదీని లైలా పెళ్లి చేసుకుంది. వివాహానికి ముందు ఆమె అతనితో ఎనిమిదేళ్ల పాటు ప్రేమలో మునిగితేలింది. ఇక వారి వివాహానికి నాలుగేళ్ల ముందే  నిశ్చితార్థం జరగడం విశేషం. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఆమె గోవాలోనే సెటిల్ అయినట్టు తెలుస్తోంది. 
 

ఇక పెళ్లి తర్వాత లైలా సినిమాలకు దూరంగా ఉంది. ఏకంగా 16 ఏళ్లపాటు వెండితెర వైపు చూడలేదు. గతేడాది కార్తీ నటించిన కోలీవుడ్ మూవీ ‘సర్దార్’తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో సమీరా థామస్ అనే పాత్ర పోషించింది. ప్రస్తుతం తమిళంలోనే ‘సబ్దమ్’ అనే చిత్రంలో నటిస్తోంది. 
 

ఇదిలా ఉంటే.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో లైలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. గతంలో తనపై ప్రముఖ డైరెక్టర్ కోపగించుకున్నాడని.. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంది... ఆమె మాట్లాడుతూ.. 2001లో ‘నందా’ అనే సినిమా చేస్తున్నాం. అప్పటికీ నాకింకా తమిళం రాదు. డైలాగ్ లు తప్పుగా చెప్పేదాన్ని. దాంతో డైరెక్టర్ బాలా (Bala) సార్ నన్ను ఎప్పుడూ తిడుతుండేవారు. ఆయనపై నేనింక సినిమా చేయనని చెప్పేంత కోపం వచ్చింది. 

కానీ కొందరు బాలా సార్ గురించి మంచిగా చెప్పారు. దాంతో ఓపిగ్గా ఉన్నాను. సినిమా పూర్తి చేశా. రిలీజ్ రోజే థియేటర్ కి వెళ్లి చూశాను. ఆడియెన్స్ గోలగోల చేయడం చూసి ఆశ్చర్యపోయాను. ఇంత బాగా నటించానా? అని షాకయ్యాను. అంత మంచి రిజల్ట్ ఇచ్చినందుకు వెంటనే బాలా సార్ దగ్గరకు వెళ్లి కాళ్ల మీద పడ్డాను. నన్ను క్షమించమని అడిగాను. ఆయనప్పుడు ఎందుకు తిట్టారో అర్థమైందని చెప్పాను.’ అంటూ పేర్కొంది. ఇక అదే సినిమాను లైలా బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలిం ఫెయిర్ అవార్డు అందుకుంది. ప్రస్తుతం ఆమె కామెంట్స్  ఆసక్తికరంగా మారాయి. 
 

Latest Videos

click me!