బేబమ్మ ఇంత మత్తుగా చూస్తే కుర్ర గుండెల్లో అలజడే.. సోషల్ మీడియాలో పెరుగుతున్న కృతి శెట్టి క్రేజ్

First Published | Jul 15, 2023, 7:25 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) నెట్టింట నిత్యం యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో బేబమ్మ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా బేబమ్మ ఇన్ స్టాలో మరింత ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
 

టాలీవుడ్ లోకి యంగ్ బ్యూటీ కృతి శెట్టి ‘ఉప్పెన’లా దూసుకొచ్చిన విషయం తెలిసిందే. తొలిచిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘బేబమ్మ’ పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది. 
 

కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఈ ముద్దుగుమ్మ హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంది. ‘ఉప్పెన’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ వంటి చిత్రాలతో సక్సెస్ అందుకుంది. అయితే ఆ తర్వాత నుంచి వరుస ఫ్లాప్స్ ను మూటగట్టుకుంది. దీంతో హ్యాట్రిక్ డిజాస్టర్లనూ మూటగట్టుకుంది. 
 


రీసెంట్ గా వచ్చిన ‘కస్టడీ’ చిత్రం కూడా బేబమ్మకు ఆశించిన మేర రిజల్ట్ ను అందించలేకపోయింది. ఫలితంగా ఆఫర్లూ తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం తమిళం, కోలీవుడ్ లో లక్కును పరీక్షించుకుంటోంది. జయం రవి నటిస్తున్న ‘జీనీ’ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. 
 

ఇదిలా ఉంటే.. యంగ్ బ్యూటీ కృతి శెట్టి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఇటీవల వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. రోజురోజుకు మరింత అందంగా మెరుస్తూ నెట్టింట ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. వరుస పోస్టులతో సోషల్ మీడియాలో క్రేజ్ దక్కించుకుంటోంది. 
 

తాజాగా బేబమ్మ ఇన్ స్టా ఫ్యామిలీ 6 మిలియన్లకు చేరుకుంది. దీంతో బ్యూటీఫుల్ గ్రీన్ డ్రెస్ లో అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది. మత్తు చూపులు, మైమరిపించే ఫోజులతో బేబమ్మ కట్టిపడేసింది. స్లిమ్ ఫిట్ అందాలతో అట్రాక్ట్ చేసింది. కృతి శెట్టి లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా లైక్స్, కామెంట్లు పెడుతూ పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. 

ఈ ఫొటోలను పంచుకుంటూ తనకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్, నెటిజన్లకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ అందుకోలేపోతున్న బేబమ్మకు సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం కోలీవుడ్, మాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఇక అక్కడ ఎలా అలరిస్తుందో చూడాలి. 
 

Latest Videos

click me!