తెల్లచీరలో బేబమ్మ మెరుపులు.. శారీలో మంత్రముగ్ధులను చేస్తున్న కృతి శెట్టి

First Published | May 31, 2023, 8:31 PM IST

చీరకట్టులో వరుస ఫొటోషూట్లు చేస్తున్న బేబమ్మ.. తాజాగా వైట్ అండ్ బ్లూ శారీలో మెరుపులు మెరిపించింది. శారీలో కృతి శెట్టి చూపుతిప్పుకోని అందాన్ని ప్రదర్శించింది. పిక్స్ వైరల్ గా మారాయి.
 

‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty).  తొలిచిత్రంతోనే మంచి హిట్ అందుకొని టాలీవుడ్ లో తన పేరు మారుమోగేలా చేసింది. వరుసగా ఆఫర్లనూ అందుకుంది. 
 

కృతి శెట్టి నటించిన తొలి మూడు చిత్రాలు.. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు మంచి సక్సెస్ ను అందుకున్నాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు గోల్డెన్ లెగ్ అనే పేరు వచ్చింది. మరోవైపు హ్యాట్రీక్ బ్యూటీ అంటూ కూడా పొగిడేశారు. దాంతో మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుంది.
 


కానీ, గత కొంత కాలంగా బేబమ్మకు కాలం కలిసి రావడం లేదు. ఏ సినిమా చేసినా బెడిసికొడుతోంది. స్టార్ ఎవరైనా ఆశించిన మేర ఫలితం దక్కడం లేదు. దీంతో కృతి శెట్టి జోరుకు కాస్తా బ్రేక్ లు పడ్డాయి. ప్రస్తుతం ఆఫర్ల విషయంలో కాస్తా ఆందోళన నెలకొంది.
 

దీంతో కృతి శెట్టి రూటు మార్చుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. వరుసగా చీరకట్టులో ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. అందాలతో ఫ్యాన్స్, నెటిజన్లను కట్టిపడేస్తోంది. అలాగే దర్శకనిర్మాతలకు కూడా తన గురించి గుర్తు చేస్తోంది. 
 

ఈ క్రమంలో తాజాగా బేబమ్మ పంచుకున్న ఫొటోలు బ్యూటీఫుల్ గా ఉన్నాయి. వైట్ ప్రింటెడ్ శారీలో కృతి శెట్టి అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. చీరకట్టులో హోయలు పోయింది. మత్తెక్కించే ఫోజులతోనూ మైమరిపించింది. నిషా కళ్లతో,  ఊరించే పెదవులతో మంత్రముగ్ధులను చేసింది.
 

బేబమ్మ వరుసగా చీరకట్టులో మెరుస్తుండటంతో నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆమె బ్యూటీని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ తో ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. చివరిగా ‘కస్టడీ’తో అలరించిన బేబమ్మ ప్రస్తుతం మలయాళంలో ‘అజాయంతే రందం మోషణం’లో నటిస్తోంది.  

Latest Videos

click me!