చిట్టినడుముతో కట్టిపడేస్తున్న బేబమ్మ.. లెహంగా వోణీలో కృతి శెట్టి బ్యూటీఫుల్ లుక్.. పిక్స్

First Published | May 14, 2023, 8:10 PM IST

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ లుక్ తో కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. తాజాగా బేబమ్మ పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ నటిగా మారిపోయింది. తొలిచిత్రంతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించే రేంజ్ కు ఎదిగింది. వరుస హిట్లతో దూసుకొచ్చింది.
 

అయితే కొద్దికాలంగా కృతి శెట్టికి అంతగా కలిసి రావడం లేదనే చెప్పాలి. టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కొత్తలో హ్యాట్రిక్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వచ్చిన చిత్రాలతో హ్యాట్రిక్ డిజాస్టర్లను కూడా మూటగట్టుకుంది. దీంతో బేబమ్మ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయని చెప్పడంలో సందేహం లేదు. 
 


ఇక తాజాగా అక్కినేని నాగచైతన్య సరసన కస్టడీ (Custody)తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘బంగార్రాజు’ తర్వాత ఈ జంట మళ్లీ వెండితెరపై మెరిసింది. అయితే ఈ చిత్రం కూడా ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం టాక్ పాజిటివ్ గా మారింది. దీంతో కృతికి ఒరిగిందేమీ లేదనే అంటున్నారు. 
 

ఇదిలా ఉంటే బేబమ్మ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. గతంలో జోరుమీదున్న ఈ ముద్దుగుమ్మ అడపాదడపా కనిపించేది. ప్రస్తుతం రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ నెట్టింట తన క్రేజ్ కు డ్యామేజ్ కాకుండా చూసుకుంటోంది. ఈక్రమంలో గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోంది. 
 

తాజాగా బేబమ్మ బ్యూటీఫుల్ లుక్ లో ఫొటోషూట్ చేసింది. అందాలతో అదరగొట్టింది. సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోయింది. లెహంగా వోణీ ధరించిన కృతి రెట్టింపు అందంతో కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది. గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

మరోవైపు కృతి స్లిమ్ ఫిట్ అందాలతో అదరగొట్టింది. ట్రెడిషనల్ లుక్ లోనూ చిట్టి నడుమును చూపిస్తూ యువతను చిత్తు చేసింది. మత్తు చూపులతో మంత్రముగ్ధులను చేసింది. నిషా కళ్లతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫ్యాన్స్ బేబమ్మ ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. కృతి ప్రస్తుతం తమిళంలోని ‘అజాయంతే రందం మోషణం’లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!