అమ్మతో టాలీవుడ్ స్టార్స్.. మదర్స్ డే సందర్భంగా తల్లిపై తారల ప్రేమ.. వైరల్ గా మారిన పిక్స్

First Published | May 14, 2023, 6:04 PM IST

మాతృ దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ సార్ హీరోలు, హీరోయిన్లు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా అమ్మపై ప్రేమను చూపించారు. 
 

మెగాస్టార్ చిరంజీవి మదర్స్ డే సందర్భంగా తన తల్లితో పాటు తల్లులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అంజనమ్మతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘అనురాగం, మమకారం... ఈ రెండిటికి అర్ధమే అమ్మ ... అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మ ని చూసే నేర్చుకున్నాం.’ అని చెప్పుకొచ్చారు. 
 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తల్లి అంజన్నమ్మతో కలిసి దిగిన ఫొటోను కూడా మెగాస్టార్ చిరంజీవి పంచుకున్నారు. తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. 
 


స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తల్లితో కలిసి ఉన్న ఫొటోను చేసింది. ‘హ్యాపీయెస్ట్ మదర్స్ డే నా బంగారు అమ్మ! నాకు అన్నీ నేర్పినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు! నువ్వు లేకుండా నేనేం చేయలేను!  నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను!’ అంటూ తల్లిపై ప్రేమను తన మాటల్లో చూపించింది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ మదర్స్ డే సందర్బంగా రేర్ పిక్స్ ను పంచుకుంది. చిన్నప్పుడు తన తల్లితో కలిసి దిగిన చైల్డ్ హుడ్ ఫొటోలను పంచుకుంది. తనపై రకుల్ తల్లి ఎంతటి ప్రేమ చూపించిందో ఆ ఫొటోలతో తెలియజేసే ప్రయత్నం చేసింది. ఆ ఫొటోలను పంచుకుంటూ సుధీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. ‘నా స్వీట్ మమ్మీ! మీరు నా చిన్నప్పటి నుండి ఇప్పటికీ వేలు పట్టుకొనే నడిపిస్తున్నారు. ధన్యవాదాలు. నేను దృఢంగా, స్వతంత్రంగా, దయగల అమ్మాయిగా ఉండాలని నాకు నేర్పినందుకు, మన కుటుంబానికి మూలస్తంభంగా ఉన్నందుకు ధన్యవాదాలు.’ అంటూ రాసుకొచ్చింది.
 

సీనియర్ హీరోయిన్  త్రిష క్రిష్ణన్ కూడా తన తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తల్లితో కలిసి దిగిన ఓ అద్భుతమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అలాగే తను తల్లులుగా భావించిన కొందరి ఫొటోలను షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా మదర్స్ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

రాశీ ఖన్నా మాతృ దినోత్సవం సందర్భంగా తన తల్లితోనే రోజంతా గడిపారు. అమ్మను ఆడిపాడిస్తూ నవ్వించింది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను పంచుకోవడం నెట్టింట వైరల్ గా మారాయి. తల్లితో ఉయ్యాల ఊగుతూ, రకరకాల ఆటలు ఆడుతూ సంతోష పెట్టింది. ‘నాలోని చైల్డ్ ను అలాగే ఉండేలా చేసినందుకు ధన్యవాదాలు, అమ్మ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈరోజు మరియు ప్రతిరోజూ మాతృదినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ విషెస్ తెలిపింది. 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ మదర్స్ డే సందర్భంగా తల్లితో దిగిన ఫొటోలను పంచుకున్నారు. ఓ వీడియోను షేర్ చేశారు. తల్లితో డాన్స్ చేస్తూ సరదగా కనిపించారు. అమ్మప్రేమను గుర్తుచేసుకుంటూ వదిలిన ఫొటోలు వైరల్ గా మారాయి. 

‘ఆర్ ఎక్స్100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తన తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఆమెతో ర్యాండమ్ గా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ‘నాకు  ధైర్యనిస్తూ, నన్ను ప్రోత్సహిస్తూ వస్తున్న అమ్మ నీకు ధన్యవాదాలు.  నాకు జీవితాన్ని పరిమితులు లేని ప్రేమను కురిపిస్తున్నందుకు రుణపడి ఉంటాను. హ్యాపీ మదర్స్ డే అమ్మ’ అంటూ నోట్ లో పేర్కొంది. 
 

Latest Videos

click me!